లోక్‌సభలో బీజేపి కార్యకర్త కలకలం.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు Man tries to jump off visitors' gallery in Lok Sabha

Man tries to jump into lok sabha chamber from visitors gallery

bjp activist, Bhola Singh, Bulandshahr, MP follower, man jumps into lok sabha, lok sabha, lok sabha chamber, lok sabha visitors gallery, man jumps into lok sabha chamber, man held in lok sabha, parliament, demonetisation, lok sabha, lok sabha today, lok sabha proceedings, man jumps lok sabha, india news

A man, suspected to be bjp activist from UP, tried to jump into the House chamber soon after the proceedings were adjourned following protests over the demonetisation issue.

ITEMVIDEOS: లోక్‌సభలో బీజేపి కార్యకర్త కలకలం.. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

Posted: 11/25/2016 03:51 PM IST
Man tries to jump into lok sabha chamber from visitors gallery

దేశం నుంచి అవినీతి, అక్రమ డబ్బు, నల్లధనం, ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదం తదితరాలన్నింటినీ ఒకే దెబ్బతో రూపుమాపగలమని భావించిన కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యధికంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకోచ్చారు. కొత్త యాప్ ద్వారా దేశప్రజలు తమ అభిప్రాయాలను తెలుపగా, సుమారు ఐదు లక్షల మందిలో 92 శాతం మంది ఇది మంచి నిర్ణయమని అభిప్రాయపడినట్లు చెప్పారు.

నరేంద్రమోడీ ప్రకటనపై స్వయంగా అ పార్టీకి చెందిన ఎంపీ, సీనీనటుడు, షాట్ గన్ గా పేరొందిన శత్రుఘ్నన్ సిన్హా పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం అపాలని.. ఇప్పటికైనా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను భ్రమల ప్రపంచంలోంచి బయటకు వచ్చి చూడాలని దుయ్యబట్టారు. అంతకు ముందు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన కేసులను కొట్టివేయాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చుతూ.. ఈ అంశంలో అల్లర్లు కూడా జరగవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

వీటిని కేంద్రం పరిగణలోకి తీసుకుని వుంటే బాగుండేదని తాజాగా పార్లమెంటు సాక్షిగా వెలుగుచూసిన ఘటనతో స్పష్టం అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ బలంద్ షహర్ కు చెందిన బీజేపి ఎంపీ బోలా సింగ్ బాజ్ పాయ్ ముఖ్య అనుచరులలో ఒకరైన రాకేష్ సింగ్ బకేల్ అనే బీజేపి కార్యకర్త ఆయనతో పాటుగా పార్లమెంటుకు వచ్చి.. అక్కడ విజిటర్స్ గాలరీలోకి వెళ్లి సమావేశాలను తిలకించాడు. లోకసభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేయగానే పార్టీ కార్యకర్త ఉన్నఫలంగా విజిటర్స్ గాలరీ నుంచి లోక్ సభలోకి దూకుందుకు యత్నించాడు.

ఈ ప్రయతాన్ని అక్కడ వున్న పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడుకున్నారు. అతని కాలు అక్కడున్న బారికేడ్ లో ఇరుక్కుపోయింది. అతన్ని అదుపులో తీసుకునేలోపు బీజేపి కార్యకర్తగా వుంటూనే అతను ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా లోక్ సభలో గళం విప్పాడు. ప్రధానికి వ్యతిరేక నినాదాలు చేశాడు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని తీసుకన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నోట్ల రద్దు విషయంలో ప్రజల్లో వున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రధాని గుర్తించాలని విపక్షాలు సూచించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp activist  Bhola Singh  Bulandshahr  MP follower  Lok Sabha  demonetisation  Parliament  

Other Articles