బీబీసీ శక్తివంతమైన మహిళగా సన్నీలియోన్! | Sunny Leone in BBC’s 100 most influential women list.

Sunny leone in bbc s 100 most influential women list

Sunny Leone, Sunny Leone BBC list, Sunny Leone, Neha Singh, BBC's 100 most influential women list, BBC's 100 most influential women list 2016, Indian Women in BBC's list

Sunny Leone, Neha Singh on BBC's 100 most influential women list.

బీబీసీ జాబితాలో సన్నీలియోన్!!

Posted: 11/22/2016 07:14 PM IST
Sunny leone in bbc s 100 most influential women list

మాజీ అడల్ట్ స్టార్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనత సాధించింది . అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ(బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్) విడుదల చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితా 2016 కు గానూ సన్నీకి చోటు దక్కింది. మంగళవారం ఈ మేరకు మంగళవారం బీబీసీ ఓ జాబితాను విడుదల చేసింది.

సన్నీలియోన్(క‌ర‌ణ్ జిత్ కౌర్ ఆమె అసలు పేరు) 35 ఏళ్ల ఈ మాజీ అడల్ట్ స్టార్, 2013 లో బాలీవుడ్ లో అడుగుపెట్టి హాట్ సెలబ్రిటీగా మారిపోయిందని అందులో పేర్కొంది. ఇక ఇదే జాబితాలో భారతీయ మహిళలు... 20 ఏళ్ల కంప్యూటర్ స్డూడెంట్ గౌరీ చందార్ కర్(సంఘాలీ, మహారాష్ట్ర), 57 ఏళ్ల ‘ట్రాక్టర్ క్వీన్’ మల్లికా శ్రీనివాసన్(చెన్నై), 34 ఏళ్ల రచయిత్రి, ఉద్యమకారిణి నేహా సింగ్(ముంబై), 80 ఏళ్లుగా 8,000 మొక్కలు నాటిన 105 ఏళ్ల సాలూమరాదా తిమ్మక్క(కర్ణాటక) కూడా ఉన్నారు.

వీరితోపాటు ఈ జాబితాలో అంతర్జాతీయ సెలబ్రిటీలైన ఎలిషియా కీస్, సిమ్మన్ బైల్స్, రచిదా దాతి, శ్రీటి వడేదరా కూడా ఉన్నారు. పాపులారిటీతోపాటు, తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న వారికి ఈ జాబితాలో చోటుదక్కింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  most influential women list  2016  

Other Articles