ఇంగ్లాండ్ ఎదుట భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా england needs 405 runs to win visakha test over India

England needs 405 runs to win visakha test over india

India vs England, visakha test, second innings, virat kohli, cheteshwar pujara, ravichandran ashwin, ravindra jadeja, gautam gambhir,Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

India 455 and 204 all out, set England (255) 405-run target by this, the crucial 42-run last wicket stand comes to an end.

ఇంగ్లాండ్ ఎదుట భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Posted: 11/20/2016 12:45 PM IST
England needs 405 runs to win visakha test over india

విశాఖపట్నం వేదికగా పర్యాటక జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కన్నా 255 పరుగుల అధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం స్కోరుబోర్డును త్వరగా పరుగులెత్తించడంలో కొంత తడబాటుకు గురైన విరాట్ సేన 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో రెండు ఇన్నింగ్లలో కలసి మొత్తంమీద 404 పరుగుల లీడ్ సాధించింది. దీంతో, ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే 405 పరుగులు సాధించాలి.

భారత సెకండ్ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ 3, రాహుల్ 10, పుజారా 1, కోహ్లీ 81, రహానే 26, అశ్విన్ 7, సాహా 2, జడేజా 14, జయంత్ యాదవ్ 27, ఉమేష్ యాదవ్ 0, షమీ 19 పరుగుల చేశారు. చివర్లో రెండు సిక్సర్లతో షమీ అలరించాడు. జయంత్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ లు చెరో 4 వికెట్లు తీసుకోగా... అలీ, అండర్సన్ లు చెరో వికెట్ తీసుకున్నారు. భోజన విరామం తర్వాత ఇంగ్లండ్ తన లక్ష్య సాధనను మొదలుపెడుతుంది. స్పిన్ కు పిచ్ సహకరిస్తుండటంతో భారత బౌలర్లు సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  second innings  Virat kohli  Team india  cricket  

Other Articles