శివసేన మొత్తానికి తన మిత్రుడి పేరును భట్టబయలు చేసింది Videocon gave Shiv Sena Rs 85 crore last year

Videocon gave shiv sena rs 85 crore last year

Videocon Industries Limited,Kumar Autowheels Pvt Ltd,Shiv Sena,Videocon,Sharad Pawar,NCP,Income Tax,EC,Congress, Election Commission of India,

Home appliances maker Videocon Industries appears to be the Shiv Sena's biggest benefactor. The company gave fraction of the donations to Shiv Sena, which has disclosed to the EC

శివసేన మొత్తానికి తన మిత్రుడి పేరును భట్టబయలు చేసింది

Posted: 11/19/2016 05:39 PM IST
Videocon gave shiv sena rs 85 crore last year

ప్రముఖ వ్యాపార సంస్థ వీడియోకాన్ మహారాష్ట్రలోని శివసేన పార్టీకి రూ.85కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో శివసేన పేర్కొంది. దీని ప్రకారం శివసేనకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చే సంస్థగా వీడియోకాన్ ఉండటం కూడా గమనార్హం. 2015-16 సంవత్సరానికిగాను, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేటరేతర సంస్థల నుంచి మొత్తం రూ.86.84కోట్ల మొత్తం విరాళ రూపంలో వచ్చిందని పేర్కొనగా అందులో రూ.85కోట్లు వీడియోకాన్ ఇచ్చిందట.

ఇక ఇదే సంస్థ శరద్ పవార్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రూ.25లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చింది. ఆదాయ పన్నుకు సంబంధించిన 139వ సెక్షన్ ప్రకారం 2016, సెప్టెంబర్ 27న శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ ఈ వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పించారు. ఈ వివరాలు కమిషన్ వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఈ వివరాలు అందించగా బీజేపీ మాత్రం ఇంకా సమర్పించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivasena  videocon  Election Commission of India  donations  political news  

Other Articles