సిరా ఎఫెక్ట్: ఏటీయం కేంద్రాల వద్ద తగ్గని జనం Even after 10 days of demonetisation long wait continues at atms

Even after 10 days of demonetisation long wait continues at atms

banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Even after 10 days of PM Modi announcement on demonetisation of RS 500, and Rs 1000, people Queue up in front of ATM centres instead of banks

సిరా ఎఫెక్ట్: ఏటీయం కేంద్రాల వద్ద తగ్గని జనం

Posted: 11/19/2016 10:16 AM IST
Even after 10 days of demonetisation long wait continues at atms

అవినీతిపై పోరులో భాగంగా పెద్ద నోట్లైన రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని పది రోజులు గడుస్తున్నా.. ఇంకా ఏటీయం కేంద్రాల వద్ద జనం పడిగాపులకు మాత్రం చెక్ పడలేదు. పగలు, రాత్రి అని తెడా లేకుండా ప్రజలు డబ్బుల కోసం ఏటీయంల వద్ద క్యూకడుతున్నారు. క్యూలైన్లతో ఏటీఎంలు కిటలాడుతున్నాయి. అమలులో లేని నోట్ల మార్పిడిలో కఠినతరమైన నిబంధనలు, కేవలం వారి సొంత కస్టమర్లకే నేడు బ్యాంకులు పనిచేయనుడటంతో బ్యాంకులు వద్ద క్యూలైన్లు తగ్గినట్టు తెలుస్తోంది.
 
క్రమక్రమంగా బ్యాంకు శాఖల్లో క్యూలైన్లు తగ్గుతాయని, ఆందోళనకర పరిస్థితులు వైదొలుగుతాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వచ్చిన కస్టమర్లే పలుమార్లు రాకుండా.. ఇతరులకు కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంక్ నిబంధనను తీసుకొచ్చింది. నోట్ల మార్పిడికి వచ్చిన కస్టమర్ల వేళ్లకు ఇంక్ గుర్తువేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఏటీఎం వద్ద మాత్రం పరిస్థితి మారలేదు. బ్యాంకుల వద్ద పరిమితులు విధించే సరికి, ఏటీఎం వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు అనంతరం నగదును ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవడంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వం పడరానిపాట్లు పడుతోంది.
 
నగదు లావాదేవీలు అధికంగా జరిపే కూరగాయల వర్తకులు, దాబాలు, చిన్నదుకాణదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వారికి సరిపడ నగదును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. చిన్న కరెన్సీ నోట్లు కూడా లేకపోవడంతో  ప్రజలు వారి కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్సపొందే పేషంట్ల పరిస్థితైతే ఇక చెప్పనక్కర్లేదు. మెడిషిన్లు కొనుక్కోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉండటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banks  ATMs  Rs 500  Rs 1  000  Queues  demonetisation  Reserve bank of India  

Other Articles