జకీర్ కు ’పీస్‘ లేకుండా చేస్తున్నారు... | Zakir Naik's NGO IRF banned for 5 years.

Zakir naik s ngo banned for 5 years

Zakir Naik, Peace Channel, controversial preacher, Zakir Naik's NGO, Zakir Naik NGO, Zakir Naik IRF, Islamic Research Foundation, IRF Ban

Government bans controversial preacher Zakir Naik's NGO for 5 years.

జకీర్ కు మరో బిగ్ షాక్...

Posted: 11/16/2016 07:32 AM IST
Zakir naik s ngo banned for 5 years

వివాదాస్పద ఇస్లామిక్ మత ఉపన్యాసకుడు జకీర్ నాయక్ కు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అతని ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఎన్టీవో సంస్థ పై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.

బంగ్లాదేశ్ లోని ఓ రెస్టారెంట్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరేపించబడి దాడులకు పాల్పడినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ఎన్జీవో సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్‌) పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా జకీర్ నాయక్ సంస్థ అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు, అక్రమ లావాదేవీలకు పాల్పడిందని, అందుకే ఐదేళ్ల నిషేధం విధించడం జరిగిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ జకీర్ నాయక్ గతంలో ఓ టీవీ ఛానెల్ సీఈవోపై 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. అంతేకాదు తనను ఇలాంటి వివాదాలు చుట్టుముడుతుండటంతో ఏడాది తరువాతే భారత్ కు వస్తానని ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అరెస్ట్ భయంతో ఈ మధ్య అతని తండ్రి చనిపోతే అంత్యక్రియలకు కూడా రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zakir Naik  Islamic Research Foundation  Ban  

Other Articles