తెలంగాణ ఉద్యోగులకు సగం శాలరీనే గతా? | Demonstration effect on Telangana Employees.

Kcr ready to give shock to employees

Telangana Employees, Half Salary, KCR, Half salary, Telangana Government, Half Salary, Telangana Employees, KCR Demonstration

Telangana Government may pay half salary to employees on Demonstration effect.

కేసీఆర్ సగం-సగం పనులు చేస్తాడా?

Posted: 11/15/2016 09:56 AM IST
Kcr ready to give shock to employees

మోదీ తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తూ కొత్త నోట్లను పంపిణీ చేయాలని కేంద్రానికి ఇప్పటికే విజ్నప్తి చేయగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం బహిరంగంగానే అంసతృప్తి వ్యక్తం చేశాడు.

చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ మరియు సీనియర్ అధికారులతో భేటీ అయిన అనంతరం మోదీ నిర్ణయంపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. దిక్కుమాలిన చర్య కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవటమే కాదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సగం మాత్రమే అందుతున్నాయని ఆక్రోశించాడు.

మరోవైపు ఇప్పటికే లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వ ఖజానా మరింతగా కుంచించుకుపోయింది. దీంతో ఈ నెల్లో ఉద్యోగుల వేతనాలు సైతం ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఈ దశలో అవసరమైతే సగం జీతం ఇచ్చి, మిగిలినది తరువాత ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు నెలకు రూ. 2,500 కోట్లు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రానికి నెలకు రూ. 9 వేల కోట్ల ఆదాయం రావాల్సి వుండగా, నోట్ల రద్దుతో అందులో సగం కూడా రాని పరిస్థితి నెలకొందని అధికారులతో చెప్పి , ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారంట.

జీతాల్లో 25 నుంచి 50 శాతం వరకూ తగ్గించి, ఆదాయం సమకూరిన తరువాత బకాయిని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా, ఈ నిర్ణయం అమలైతే దాదాపు 3.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అంచనా. ఇదే సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ కూడా నిలిపివేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తం నెలకు తెలంగాణ రెవెన్యూ ఆదాయం 3,600 కోట్లు కాగా, కేంద్ర నుంచి పన్ను సంక్రమణల ద్వారా వచ్చే ఆదాయం 1,000 కోట్లు. తాజా పరిస్థితితో ఆదాయం 60 శాతం పడిపోగా, కేంద్రం ఇచ్చే ఆదాయం 40 శాతంగానే ఉంది. ఆదాయంలో ఎక్కువ వాటా ఉన్న ఎక్సైజ్ విభాగం గతంలో 110 కోట్ల ఆదాయం సుకూర్చగా, ఇప్పుడదీ 45 కోట్లకు పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonstration  Telangana Employees  KCR  

Other Articles