రెండు వారాలు కాదు.. రెండు నెలల సమయం పట్టోచ్చు.. Normalcy at ATMs could take two months to return

Normalcy at atms could take two months to return

banks, bank managment, Arun jaitley, cm kcr, telangana cm kcr, kcr slams central covernment, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

It could take upto two months to recalibrate the two lakh ATMs in the country says banks managments and people should expect some more time for normalisation

రెండు వారాలు కాదు.. రెండు నెలల సమయం పట్టోచ్చు..

Posted: 11/14/2016 01:30 PM IST
Normalcy at atms could take two months to return

అవినీతి, నకిలీ నోట్లను దేశం నుంచి పారద్రోలేందుకు కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో.. బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యూ కడుతున్న సామాన్యులకు.. అర్థిక కష్టాలు ఇప్పడప్పుడే తీరేలా లేవు. సామాన్య ప్రజలు మాత్రం నానా ఇక్కట్లు పడుతున్నారు. పనులు మానుకుని మరీ, పచ్చ నోటు కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చుంటున్న వారికి డబ్బు వచ్చే అదృష్టం వుందో లేదో నోట్లు చేతిలో పడే వరకు అర్థంకావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకోగలమని, అయితే మరో రెండు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
 
కాగా బ్యాంకు యాజమాన్యాల వాదన మాత్రం పూర్తిగా భిన్నంగా వుంది. రెండు వారాల్లో పరిస్థితికి అదుపులోకి తేవడం కష్టమని, మరో ఆరు వారాలు పట్టే అవకాశముందని చావు కబురు చల్లగా చెప్పాయి. కొత్త నోట్లు ప్రవేశపెడుతున్నందు వల్ల ఏటీఎంల్లో సరికొత్త టెక్నాలజీని వినియోగించాల్సి వస్తోందని, అందుకే ఇంత ఎక్కువ సమయం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు. ఒక్కో ఏటీఎంను అప్‌డేట్ చేయడానికి దాదాపు 15 నిమిషాలకు పైగా సమయం పడుతోందని తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతానికి 3వేల మంది ఇంజనీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని, మరో వెయ్యి మందికి పైగా అవసరం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా ఏటీఎంల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు బ్యాంకు యాజమాన్యాలు తెలిపాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, ఏటీఎంల్లో డబ్బు అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు సమయం పట్టే అవకాశముందని బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం పూజలతో పాటు వివాహాలపై ప్రభావం చూపుతుండగా, అటు క్రైస్తవుల క్రిస్మస్ పండగతో పాటు నూతన సంవత్సరం వేడుకలపై కూడా ప్రభావం చూపనుందని తెలిపింది. ఇక రాష్ట్రాలు కూడా అదాయాన్ని కోల్పోవల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles