తొలిఇన్నింగ్స్ లో 49 పరుగలు వెనుకబడిన టీమిండియా Match evenly poised as India all out for 488

Match evenly poised as india all out for 488

India vs England,first test,day 4,score update,r ashwin,wriddhiman saha,Virat Kohli,hit wicket,Kohli hit wicket,Adil Rashid,India vs England score

Virat Kohli got out in a strange manner, Ajinkya Rahane failed to trouble the scorers too much and it looked like India would fold quickly to give England a big first innings lead.

రాజ్ కోట్ టెస్టు: తొలిఇన్నింగ్స్ లో 49 పరుగులు వెనుకబడిన టీమిండియా

Posted: 11/12/2016 02:23 PM IST
Match evenly poised as india all out for 488

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా వెనుకబడింది. పర్యటక జట్టు సాధించిన స్కోరును బ్యాటింగ్ ప్రారంభించిన తొలి రోజు ధీటుగా బదులిచ్చిన భారత్.. ఇవాళ క్రమంగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాజ్ కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 488  పరుగులకు ఆలౌటైంది. 319/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 169 పరుగులను జత చేసిన మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.

మిడిల్ అర్డర్ లో ధీటైన బ్యాట్స్ మెన్లగా పేరొందిన అజింక్యా రహానే(13), కోప్టెన్ విరాట్ కోహ్లీలు త్వరగా పెవీలియన్ చేరడంతో భారత్ ఒడ్డున పడేందుకు ప్రయాసపడింది. ఐదో వికెట్ గా అవుటయ్యాక, కాసేపటికి విరాట్ కోహ్లి(40) పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 361 పరుగుల వద్ద ఆరో వికెట్ ను నష్టపోయింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, వృద్దిమాన్ సాహాలు నిలకడగా అడి సోర్కు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహ 35 పరుగుల వద్ద వెనుదిరగేందుకు ముందు వీరద్దరి కలసి భారత్ ఏడో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

కాగా, అశ్విన్ మాత్రం అలానే క్రీజ్ను అంటిపెట్టుకుని టెయిలెండర్లతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.  అదే క్రమంలో అతని టెస్టు కెరీర్లో ఏడో హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్ గా అవుట్ అయిన అశ్విన్.. 138 బంతుల్లో 7పోర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు సాధించగా, అన్సారీ, మొయిన్ అలీలు రెండేసి వికెట్లు తీశారు.స్టువర్ట్ బ్రాడ్,  బెన్ స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 537 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ కు 49 పరుగుల ఆధిక్యం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  rajkot test  first innings  Team india  cricket  

Other Articles