కిలో ఉప్పు జస్ట్ 700 రూపాయలు మాత్రమే | with rumour people Que for buying salt.

Salt price increase just a rumour

Salt Price, Salt KG 250, Salt KG 700, Rumours on Salt, Salt Rate, Salt Shortage, Salt Rumour, salt price increase, Salt Price Whats App message

Salt price rise rumours swirl, govt denies shortage.

ఉప్పు మంటకు అసలు కారణం తెలిసింది

Posted: 11/12/2016 12:45 PM IST
Salt price increase just a rumour

నల్లధనం నిర్మూలనకు తీసుకున్న రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయనే వందతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కిలో ఉప్పు ధర రూ.400 అవుతుందంటూ పుకార్లు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే.

ఒక్క యూపీనే కాదు.. దేశం మొత్తం కూడా ఇదే సీన్ దర్శనమిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా ఉప్పు ధరకు రెక్కలొచ్చింది. కిలో ఉప్పు రూ.200లకు విక్రయిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. మొరాదాబాద్‌లో 3 కిలోల ఉప్పుకు పలు దుకాణాల్లో రూ.500 అడిగినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో తాను రూ.55 చెల్లించి కిలో ఉప్పు కొన్నట్లు టెలికం ఉద్యోగి అభిషేక్‌ రాయ్‌ తెలిపారు. శనివారం నుంచి కిలో ఉప్పు రూ.300కు చేరుకుంటుందని కిరాణా దుకాణదారులు బెదిరించినట్లు అలహాబాద్‌కు చెందిన జైనాబ్‌ జాఫర్‌ అనే మహిళ తెలిపారు. కాగా, ముంబైలో అయితే ఏకంగా, రూ. 700 కిలో చొప్పున ఉప్పును అమ్మేస్తున్నట్లు సమాచారం.

గతరాత్రి ఆ వదంతులు హైదారాబాద్ కు కూడా పాకాయి. దీంతో, హైదరాబాద్ లోని పలుచోట్ల ఉప్పు ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఇక్కడి పాతబస్తీలో అర్ధరాత్రి ఉప్పు ప్యాకెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ప్యాకెట్లను రూ.200 నుంచి రూ. 300కు వ్యాపారులు అమ్మినట్లు సమాచారం. బోరబండ, యూసుఫ్ గూడ, శ్రీరామ్ నగర్ లో భారీగా ఉప్పు కొనుగోళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉప్పు కొరత లేదని, వదంతులు నమ్మవద్దని ఆ ప్రకటనలో కోరారు. వదంతులు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉప్పు బోలెడు ఉంది...

ఉప్పు కొరత వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిలో ఉప్పు రూ.14 నుంచి 15 రూపాయలకు మించలేదని మంత్రి స్పష్టం చేశారు. 22 రకాల నిత్యావసర వస్తువులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, వాట్సాప్, సోషల్ మీడియాలో కొందరు రేపిన పుకార్ల వల్లే ఇదంతా జరిగిందని ఆయన వివరించారు.

ఇక సోషల్ మీడియాలో ఇటీవల వెలువడుతున్న కొన్ని కథనాలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి వివరించారు .దేశంలో ఉప్పు కొరతగా ఉందని కిలో ఉప్పు ధర రూ. 250 కి చేరుతుందనే మెసేజ్‌లు సైతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఉప్పుధర పెరుగుతుందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని.. అవికేవలం పుకార్లు మాత్రమే అని ఆయన ప్రజలకు సూచించారు.

ఎవరైనా ఎమ్మార్పీ ఖంటే ఎక్కువ నిత్యావసర సరుకులను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salt  Fake News  Salt Rumour  

Other Articles