ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు, ఉద్రిక్తతలు.. Protesters take to the streets following Trump's stunner

Trump victory sparks angry protests across california not my president

Hillary Clinton, Hillary first win, US Presidential Elections, election results, 45th president, canada immigration, canada, canada website, trump victory, America, democratic, republican, donald trump presidnet of US. american president donald trump

Protesters across the U.S. took to the streets early Wednesday to express their opposition to President-elect Donald Trump. Who was declared the winner of the election.

ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు, ఉద్రిక్తతలు..

Posted: 11/09/2016 09:29 PM IST
Trump victory sparks angry protests across california not my president

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ను ప్రకటించిన కొద్ది సేపటికే అమెరికా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కాయి. ట్రంప్‌ గెలుపు జీర్ణించుకోలేకపోతున్న ఆయన వ్యతిరేకులు నార్త్‌ కాలిఫోర్నియా నుంచి సీటెల్‌ వరకు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు తెలుపుతున్నారు. దీంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్తత నెలకొంటున్నట్టు సమాచారం. ఇంకా, అధ్యక్షపీఠం కూడా ఎక్కకముందే, ‘ట్రంప్, మా అధ్యక్షుడు కాదు’ అంటూ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో సుమారు రెండు వందల మంది ఆందోళనకారులు నిరసనకు దిగారు. రహదారులను దిగ్బంధించారు. బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (బీఏఆర్ టీ)ని మూసి వేసేందుకు యత్నించారు.
 
డెమొక్రటిక్‌ పార్టీకి మద్దతుగా ఉన్న లిబరల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లన్నింటిలోనూ ట్రంప్‌ విజయానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. కాలిఫోర్నియా కాలేజీ క్యాంపస్‌లోనూ, ఓరేగాన్‌లోనూ ట్రంప్‌ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. లాస్‌ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన 500 మంది నిరసనకారులు  ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వారు ట్రంప్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
 
కాలిఫోర్నియా ఓక్లాండ్‌ డౌన్‌టౌన్‌లో దాదాపు 100 మంది గుమిగూడి ట్రంప్‌ గెలుపుపై నిరసన చేపట్టారు. ట్రంప్‌ వ్యతిరేక  నినాదాలతో హోరెత్తిస్తూ టెలిగ్రాఫ్‌ అవెన్యూ వరకు ర్యాలీగా బయలుదేరారు. దీంతో అక్కడ ఉన్న బే ఏరియా ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ స్టేషన్‌ను మూసివేశారు. ట్రంప్ ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారని, అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఇళ్ల అద్దాలను బద్దలుకొట్టి హింస్మాత్మక చర్యలకు పూనుకుంటున్నట్లు తెలిసింది.

మరోవైపు సాన్‌ జోస్‌, బర్కెలీ ప్రాంతాల్లోనూ విద్యార్థులు వందలసంఖ్యలో రోడ్డెక్కి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోర్ట్‌ల్యాండ్‌లోనూ ట్రంప్‌ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ భారీసంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు రోడ్లపై వాహనాలను నిలిపివేసి.. ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇరవై సంవత్సరాల ఒక యువతిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టి,బీఏఆర్ టీ ను కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు మూసివేశారు. మరో సంఘటనలో .. బెర్కిలీలోనూ ట్రంప్ పై నిరసనలు వ్యక్తం చేశారు.  సీటెల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  donald trump  US Presidential Elections  45th president  America  

Other Articles