పటేల్ దెబ్బకి కశ్మీర్ కలిసిపోయేది.. కానీ | Indian Iron man birthday special.

Special story on sardar vallabhbhai patel141 birthday

Special story on Indian Iron Man , Indian Iron Man Sardar Vallabhbhai Patel, Sardar Vallabhbhai Patel's 141 birthday, Sardar Vallabhbhai Patel's birthday special, modi Patel birthday, raghuram patibanda on sardar vallabhbhai patel, raghuram patibanda poem on patel

Special story on Indian Iron Man Sardar Vallabhbhai Patel's 141 birthday.

ఉక్కు సంకల్పానికి వందనం

Posted: 10/31/2016 11:35 AM IST
Special story on sardar vallabhbhai patel141 birthday

భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్. జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.

బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు.

రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు.
దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు.

హైదరాబాదు, జునాగఢ్ లాంటి మొండి సంస్థానాలను భారతదేశము లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. కాస్తుంటే కశ్మీర్ కూడా మనలో కలిసిపోయేదే. కానీ, నెహ్రూ ఐక్యరాజ్యసమితి దౌత్యంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అంతేకాదు నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైయ్యాడు పటేల్. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది. ఆయన జయంతి సందర్భంగా గౌరవార్థం ఓ గేయం...

 

కదలిరా...కదలిరా...కదలిరా

వినిపించవోయ్ మన జాతీయ గీతాన్ని

ప్రకటించవోయ్ మన ఐక్యతా భావాన్ని

పూరించవోయ్ మనశాంతి సమరాన్ని

అందించవోయ్ మన ప్రేమాను రాగాన్ని

కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం ఒక్కటేరా

కుల,మతాలకు, రాగద్వేషాలకు,

బీద,ధనిక వర్గాలకు అతీతమైనదిరా

అదే మన భారతీయతరా

                           కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

 త్రివర్ణ పతాకం రెపరెప లాడాలి ప్రతి రోజు

అందరి హృదయాలలో వెలగాలి జాతీయ జ్యోతులు

ప్రసరించాలి నలుదిశలా అభ్యుదయ కిరణాలు

వికశించాలి భారతీయతా పుష్పాలు

                             కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

కావాలి మనందరకు కూడు,గుడ్డ,నివాసం

నిండాలి మన నదీనదాలు, జలకళలతో

పండాలి మన పాడి పంటలు సమృద్దిగా

తీరాలి మన రైతుల కష్టాలు కలకాలం

                                 కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

మంచు కొండల నడుమ, దట్టమైన అడవులలో

అందరకు దూరంగా, అకుంఠిత దీక్షతో మనుగడ సాగిస్తూ

దేశాభ్యు దయమే తమ జీవిత లక్ష్యంగా

కాపాడుతున్న మన వీర జవానులకు

అందించాలి వారికి మనోధైర్యాన్ని, నిలబడాలి వారికి అండ దండలై

                                    కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

చూపించాలి వారికి ఐక్యతా భావాన్ని, వినిపించాలి వారికి మన నాదాన్ని

జై,జవాన్ ..జై,జవాన్ ..భారత్ మాతాకీజై, భారత్ మాతాకీజై, ఏక కంఠంగా.

                                    కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!

                                                                                                               - ఇట్లు మీ
                                                                                                                 రఘురాం పాటిబండ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Iron Man  Sardar Vallabhbhai patel  141 birthday  raghuram patibanda poem  

Other Articles

 • Covid 19 update six deaths 94 fresh corona cases in telangana

  కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో 94 అత్యధిక కేసులు..

  Jun 02 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు ప్రతీ రోజు రాష్ట్రంలో... Read more

 • Lpg cylinder prices hiked after 3 consecutive cuts

  ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయహో.!

  Jun 01 | కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగింది. మహమ్మారి కారణంగా మార్చి నెల నుంచి... Read more

 • Glass alcohol bottle surgically removed from mans anal cavity

  తాగుబోతు వేషాలు: మందుబాటిల్ ను అక్కడ దాచిపెట్టాడు..

  Jun 01 | పీకల వరకు మద్యం సేవించిన ఓ మందుబాబు చేసిన వ్యవహారంతో తన కెరీర్ లో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త కేసును వైద్యులు చూసి షాక్ అయ్యారు. తన తాగుబోతు వేశాలతో..  ఔరా.. అని... Read more

 • 10 digit mobile numbers to continue no shift to 11 digits trai

  11 అంకెల ఫోన్ నెంబర్.. క్లారిటీ ఇచ్చిన ట్రాయ్..

  Jun 01 | దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన 4జీ సర్వీసులు కూడా అధునీకరించబడుతున్న రోజలివి. ఇక త్వరలోనే 4జీ టెక్నాలజీ పోయి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే సోషల్ స్టేటస్ సింబల్... Read more

 • Andhra pradesh minister family goes self quarantine

  ఆంధ్రప్రదేశ్ కరోనా కలకలం.. క్వారెంటైన్ లోకి మంత్రి సహా కుటుంబం

  Jun 01 | ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. మంత్రి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. దీంతో అమాత్యులవారికి కూడా హుటాహుటిన వైద్యాధికారులు పరీక్షలు చేయగా..... Read more

Today on Telugu Wishesh