పండగ రోజు కూడా పాత వరుసలోనే రాంగోపాల్ వర్మ RGV insults former Prime Ministers via tweets

Rgv insults former prime ministers via tweets

ram gopal varma, ram gopal varma tweets, rgv, rgv tweets, ram gopal varma prime ministers, ram gopal, ram gopal varma controversys, atal bihari vajpayee, pv narsimha rao, chandra shekhar singh and sonia gandhi, entertainment news

Controversy's favourite child Ram Gopal Varma is back to doing what he does best- heaping insult on Twitter.

పండగ రోజు కూడా పాత వరుసలోనే రాంగోపాల్ వర్మ

Posted: 10/30/2016 09:25 AM IST
Rgv insults former prime ministers via tweets

తన మనసుకు తోచిందే తప్ప ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి పర్వదినాన.. వెర్రి వెర్రీ బ్యాడ్ దీపావళి అంటూ ట్విట్ చేయడంతో పాటు పండగ పూట కూడా తన వరును మార్చుకోకుండా వివాదాస్పద ట్విట్టు చేశాడు. అదీ కూడా ప్రపంచం నలుదిశలా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఇద్దరు మాజీ ప్రధానులపై వివాదాస్పందంగా ట్విట్ చేయడంతో.. ఆయనపై ట్విట్లరైట్లు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహరావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను లక్ష్యంగా చేసుకుని జోకులేశారు. సోనియా ముందు కూర్చుని ఉండగా, వెనుక బెంచీలో వాజ్ పేయి, పీవీ నరసింహరావులు కూర్చున్న పాత ఫోటోను ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటూ, బ్యాక్ బెంచీలో కూర్చున్న వారంతా చెడ్డవారేనని, వీరు ఎవరో తనకు తెలియదుగానీ, ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని అన్నాడు.

ఇదే ఫోటోను మరోసారి పోస్ట్ చేస్తూ, ఈ వ్యక్తులు మహిళలను అగౌరవంగా చూస్తున్నట్టుందని, వీరెవరో పోలీసులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఆపై నిమిషాల వ్యవధిలో మూడోసారి పోస్ట్ చేస్తూ, వీరంతా తమ ముందు హుందాగా కూర్చున్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేస్తున్నట్టుందని, ఇది తనకు షాక్ కలిగిస్తోందని చెప్పాడు. ఇక వర్మ తాజా పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles