వృద్ధుడిని చంపాయంటూ.. వంద కుక్కలను పాపం... | Stray dogs mass killed in Varkala

Stray dogs mass killed in varkala

Kerala Stray dogs mass killed, 90 stray dogs killed, Varkala stray dogs, Kerala stray dogs

After Old Man died in Stray dogs attack, Locals mass killed in Varkala Kerala.

వంద కుక్కలను అతికిరాతకంగా చంపేశారు

Posted: 10/28/2016 04:40 PM IST
Stray dogs mass killed in varkala

కేరళలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆ మధ్య గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఓ ఐదు కుక్కలను చంపి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపటం కూడా చూశాం. దీనిపై తొలుత సీఎం పినరయి విజయన్ కూడా కానివ్వండంటూ ఆదేశాలిచ్చినప్పటికీ, జంతు సంరక్షణ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో వెనక్కి తగ్గాడు. అయితే ఇప్పుడు మరో దారుణమైన ఘటన అక్కడ చోటుచేసుకుంది.

వరకాలలో ఆరుబయట నిద్రిస్తున్న 90 ఏళ్ల వృద్ధుడిని ఆరు వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలపాలైన ఆ వృద్ధుడు రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. రాఘవన్ అనే ఆ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ అతను చనిపోయాడు. అంతే స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

kerala dog attack old died

కనిపించిన వీధికుక్కనల్లా చంపుకుంటూ పోయారు. సుమారు 90కి పైగా కుక్కలను వారు చంపేసినట్లు సమాచారం. మరో పక్క ఈ మూగజీవాలను చంపకుండా కాపాడాలంటూ కేరళ ప్రభుత్వానికి విజ్నప్తులు అందుతున్నాయి. ఇక మూగజీవాలను చంపటంపై తీవ్ర విమర్శలు చేసిన మేనకాగాంధీపై జోక్యం తగదని కేరళ బీజేపీ నేత మురళీధరన్ లేఖ రాశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Varkala  stray dogs attack  90 dogs killed  

Other Articles