ఉత్తుత్తి కాల్ తో ఉరకలెత్తిన పోలీసులు.. Man threatens to kill CM, calls up police

Man threatens to kill arvind kejriwal calls up police

arvind kejriwal, threat call, Delhi Police, Khajuri Khas area, drunkard, mentally unsound, Ravinder Kumar Tiwari, crime newsdelhi news, delhi crime news, kejriwal news, cm kejriwal, latest kejriwal news, india news, latest news

The call was received around 6.16 pm at the police control room and but it was later found to be hoax, said a senior police officer.

ఉత్తుత్తి కాల్ తో ఉరకలెత్తిన పోలీసులు..

Posted: 10/27/2016 10:23 AM IST
Man threatens to kill arvind kejriwal calls up police

దేశ రాజధాని ఢిల్లీలో ఫుల్ గా తాగి కాపాడండీ కాపాడండీ అంటూ పోలీసులను పరుగెత్తించిన యువతి ఘటనను మర్చపోకముందే.. ఈ ఘటన గురించి తెలుసుకుని చేశాడో లేక సరదాగా ఆటపట్టించాలనుకున్నాడో తెలియదు కానీ ఏకంగా ఓ తాగుబోతు.. అందులోనూ మతిస్థిమితం లేని వ్యక్తి పోలీసులను ఉరలెత్తించాడు. ఎలా అంటారా.. సేమ్ ఓల్డ్ పద్దతి. అదేనరండీ..ఉత్తుత్తి బెదిరింపు కాల్. ఈ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇంతకీ ఈ తాగుబోతు ఎవర్ని బెదరించాడో తెలుసా..? ఏమని బెదరించాడో తెలుసా..? పోలీసులు కంగారు పడి వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా..?

ఢిల్లీలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కాల్చిచంపేస్తానని ఏకంగా పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌ 100కు ఫోన్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. కేజ్రీవాల్‌ రోడ్డుమార్గంలో చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈ బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలింది. మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు గుర్తించామని పోలీసులు చెప్పారు. అతను మద్యం తాగి.. మతి స్థిమితం లేని స్థితిలో ఉన్నాడని తివారీ ఇంటికి విచారణకు వెళ్లిన పోలీసులకు స్థానికులు చెప్పారు. కాగా, అతను ఇంకా పరారీలో ఉన్నాడు’ అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం కార్యాలయానికి ఈ బెదిరింపు కాల్‌ వివరాలను తెలిపినట్టు ఆయన వివరించారు. అయితే తివారీని అదుపులోకి తీసుకుని విచారిస్తేగాని మరిన్నీ వివరాలు తెలియవని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  threat call  Delhi Police  Ravinder Kumar Tiwari  crime news  

Other Articles