అంబానీ కాబోయే అల్లుడు ఎవరో ఎవరికీ తెలీదా? | Not Mukesh Ambani's daughter wedding in November.

Not mukesh ambani s daughter wedding in november

No wedding bells for Mukesh Ambani's daughter, Indian Richest wedding, Ambani lavish wedding, Isha Ambani love marriage, rumour on Isha Ambani wedding,

No wedding bells for Mukesh Ambani's daughter Isha in November, it's niece of Him.

ఆ రిచ్చెస్ట్ పెళ్లి ఇప్పట్లో లేనట్లేనంట...

Posted: 10/26/2016 10:57 AM IST
Not mukesh ambani s daughter wedding in november

వీఐపీల పెళ్లిళ్లు ఈ మధ్య ఏ రేంజ్ లో జరుగుతున్నాయో మైనింగ్ టైకూన్ గాలి జనార్దన్ ఇంట జరిగే వివాహ సందడిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లి ఆహ్వాన పత్రిక దగ్గరి నుంచి బాహుబలి మాషిష్మతి రాజ్యాన్ని తలపించేలా ఆర్ట్ డైరక్టర్లతో సెట్లు... వేల కొద్దీ వంటకాలు వెరసి ఖర్చు మాత్రం లెక్కలేనంతగా. మరి అలాంటిది కోట్లకు పడగలెత్తిన అంబానీ ఇంట ఆ వేడుక ఎలా ఉంటుందో అంచనా వేయగలమా? రియలన్స్ అధినేత ముకేష్ అంబానీ గారాల పట్టి నిషా నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు గత రెండు రోజులుగా షికార్లు కొడుతున్నాయి.

24 ఏళ్ల నిషా ప్రేమలో ఉందని, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నలు ఇచ్చాయని, అందుకే అతిత్వరలో అంబానీ వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని పుకార్లు రేగాయి. అయితే ప్రేమ వ్యవహారం ఏమోగానీ, పెళ్లికి సంబంధించి గుట్టు చప్పుడు ప్రకటన ఉండదు కదా. పైగా వరుడు ఎవరో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తెలిసింది. ముకేష్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నప్పటికీ అది అతని మేనకోడలుకి సంబంధించిందని అధికారికంగా రిలయన్స్ వర్గాలు కూడా సమాచారం అందించాయి.

ఓ జాతీయ పత్రిక ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా నిషా పెళ్లికి రెడీ అయిందని, ఇండియాలో ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో వైభవంగా పెళ్లి చేసేందుకు ముఖేష్ సిద్ధమైపోయాడని పేర్కొంది. అంతేకాదు పెళ్లికి షారూఖ్ తోపాటు పలువురు సెలబ్రిటీలతో గానాభజనా ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Ambani daughter  Isha Ambani wedding  

Other Articles

Today on Telugu Wishesh