సభలు పెట్టనని... ఈ అనంత సభ అనౌన్స్ మెంట్ ఏంటి? | Janasena public meet in Anantapur on November 10

Janasena public meet in anantapur on november 10

Pawan Kalyan's Janasena public meet, Janasena Third Public meeting, Janasena public meet in Anantapur, Janasena November 10th Anantapur, Why Pawan Janasena meeting in Anantapur

Pawan Kalyan's Janasena public meet in Anantapur on November 10.

జనసేన అనంత సభ లాజిక్ ఉందా?

Posted: 10/25/2016 08:05 AM IST
Janasena public meet in anantapur on november 10

కాకినాడ సభలో ప్రత్యేక హోదా పై గళం విప్పటమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుదిమెత్తంగానే వార్నింగ్ ఇచ్చాడు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే తన సభలతో అభిమానుల ప్రాణాలు పోతుండటం గమనించి ఇకపై సభలు నిర్వహించబోనని కూడా ప్రకటించాడు. కానీ, సోమవారం నవంబర్ 10న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేసేశాడు. పార్టీ ట్రెజరర్ ఎం.రాఘవయ్య వచ్చే నెల 10వ తేదీన సభ ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపాడు. నిజానికి సభను అక్టోబర్ మొదటి వారంలోనే నిర్వహించాలని అనుకున్నారంట. అయితే సరిహద్దులో ఉద్రిక్తతలు, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో సబబు కాదని ఆగిపోయారంట.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పటం, సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్య వంతులను చేయటం అని చెబుతున్నప్పటికీ, పార్టీ విస్తరణ అనే ప్రధాన అంశంతోనే అనంతపురంలో సభను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కరవు జిల్లా అయిన అనంతపురంను ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే కనబడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ జిల్లా కీలకపాత్ర పోషించింది.

ఆపై ప్రత్యేకహోదా డిమాండ్ కోసం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఉద్యమాలు కూడా ఇక్కడ జరిగాయి. ప్రత్యేక హోదా ద్వారా అనంతపురంకు కలిగే లాభాలను కూలంకశంగా వివరించడం ద్వారా అక్కడి జనాల్లో బలంగా నాటుకు పోవచ్చనే అభిప్రాయంతోనే ఈ వ్యూహాత్మక అడుగు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిశితంగా పరిశీలిస్తే...

ఇప్పటికే రెండు సభలు నిర్వహించగా, మొదటిది తిరుపతిలో, రెండోది కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. అయితే హోదా ప్రత్యేకం అని చెప్పింది మాత్రం కాకినాడ సభ నుంచే.. ఈ లెక్కన టెక్నికల్ గా అనంతపురం సభ రెండోది కాబోతుంది. పవన్ కళ్యాణ్‌లు గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరుపతి సభలో పాల్గొన్నారు. ఆ సభలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో తొలి సభను తిరుపతిలో పవన్ నిర్వహించారు.

1997లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసింది. దానిని కారణంగా చెబుతూ రెండో సభను కాకినాడలో నిర్వహించారు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం అని రీజన్ చెబుతున్నప్పటికీ, ఇండైరక్ట్ గా టీడీపీ కంచుకోట అయిన అనంతలో పాగా వేసేందుకే మూడో సభ నిర్వహించబోతున్నాడని అర్థమౌతోంది. ఈ లెక్కన పవన్ స్ట్రాటజీ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే అర్థం చేసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Anantapur  Public Meeting  November 10th  

Other Articles