రాహుల్ గాంధీ పెళ్లి ప్రపోజ్ చేస్తే... ముంబై భామల రియాక్షన్ | Mumbai Girls Reaction for Rahul Gandhi Marriage proposal

Mumbai girls hillarious reaction for rahul gandhi marriage proposal

Mumbai Girls Reaction on Rahul Gandhi, Rahul Gandhi's Marriage proposal to Mumbai Girls, Mumbai Girls Prank on Rahul Gandhi, Mumbai Girls reject Rahul Gandhi proposal, Mumbai Girls not intrested on Rahul, Mumbai Girls not Intrest on Pappu, Rahul gandhi's Marriage Prank Video

Mumbai Girls Reaction for asking Rahul Gandhi's Marriage proposal to them in Shitchat.

ITEMVIDEOS: పప్పుసుద్దను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?

Posted: 10/22/2016 01:07 PM IST
Mumbai girls hillarious reaction for rahul gandhi marriage proposal

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత పార్టీలోనే కాదు.. ప్రజల దృష్టిలో కూడా రాను రాను చులకన అయిపోతున్నాడు. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా అ..ఆ... లు దిద్దే స్టేజీలోనే ఉన్నాడేమో అన్న చందాన మాట్లాడుతూ పరువు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే దేశానికి కాబోయే ప్రధాని అని కార్యకర్తలతో చాటింపు వేయించుకుంటున్న ఆయనగారికి ముంబై అమ్మాయిలు  భలే పంచ్ ఇచ్చారు.

షిట్ చాట్ అనే ఓ టీవీ షోలో ప్రాంక్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రాహుల్ గాంధీ మీకు పెళ్లి ప్రపోజ్ చేస్తే మీ ఒపినీయన్ ఏంటి? అని అడుగుతాడు. వారి నుంచి వచ్చిన సమాధానం వింటే పాపం రాహుల్ గాంధీ అనుకోవాల్సిందే. ఓ పాతిక మందిని ప్రశ్నిస్తే ఒక్క అమ్మాయి తప్ప(ఆమెకి రాజకీయాలంటే చాలా ఆసక్తంట), మిగతా అందరూ నో అనే సమాధానం చెప్పారు. రాహుల్ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని, తల్లి చాటు నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని కొందరు అంటే... ముసలోడు అయిపోయాడు అంటూ మరికొందరు సమాధానం ఇచ్చారు.

ఇక ఇంకొందరైతే రాహుల్ అందగాడే గానీ, మాటకారి కాదంటూ తేల్చేశారు. దేశానికే ఏం చేయలేని వాడు.. మాకేం చేస్తాడంటూ మరికొందరు చెప్పారు. పప్పును ఎవరైనా చేసుకుంటారా అని, ఛీ... యాక్.. అంటూ అసహ్యామైన భావాలు పెడుతూ మరికొందరు తప్పించుకున్నారు. తానసలు అమ్మాయినే కాదంటూ అక్కడి నుంచి పారిపోతానని మరో యువతి చెప్పింది. మొత్తానికి రాజకీయ భవిష్యత్తు ఏమోగానీ వైవాహిక జీవితానికి సంబంధించి మాత్రం వారిచ్చిన పంచ్ ల వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.     

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Girls  Rahul Gandhi  Marriage Proposal  Prank Video  

Other Articles