టీఆర్ఎస్, కాంగ్రెస్, పోలీస్ బాసుల లింకులు తెలిసినా ఏం చేయరా? | nayeem aids gives shock in SIT enquiry

Nayeem aids gives shock in sit inquiry

SIT inquiry on Nayeem Case, several leaders names in Nayeem, Nayeemuddin political links, Nayeem Political links, Nayeem political links, Nayeem aids, Nayeem aids also links with leaders, Police Nayeem links, vidyasagar nayeem

several leaders names come out in SIT inquiry on Nayeem Case. Submit report to Bhuvanagiri Court.

నయీం అనుచరులు కూడా షాకులే ఇస్తున్నారే!

Posted: 10/19/2016 08:22 AM IST
Nayeem aids gives shock in sit inquiry

గ్యాంగ్‌స్టర్ నయీం యవ్వారంలో ‘సిట్’ దర్యాప్తు దిమ్మదిరిగే వాస్తవాలను బయటపెడుతోంది. అంటకాగిన బడాబాబుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తరతమ భేదం లేకుండా రాజకీయ పార్టీల నేతల నుంచి పోలీసుల వరకు నయీంతో అంటకాగారు. దొరికింది దొరికినట్టు దోచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు, అప్పట్లో కాంగ్రెస్, ప్రస్తుతం టీఆర్ఎస్ నేత అయిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, సీఐ వెంకటయ్య తదితర పోలీసుల అధికారులు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ప్రజల భూములను కబ్జా చేసి పప్పుబెల్లాల్లా పంచేసుకున్నారు. బినామీలే స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం విశేషం.

సిట్ దర్యాప్తులో బినామీలు అప్పట్లో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. నయీం బినామీ వెలగపూడి శివరాం.. డీఎస్పీ మలినేని శ్రీనివాసరావు, నయీంకు మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాడు. గంగసాని రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, మధుకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో నయీంకు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించాడు. నర్సింహారెడ్డి అనే నయీం మరో బినామీ పోలీసుల అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు పేరును ప్రస్తావించాడు. చింతల వెంకటేశ్వరరెడ్డికి రెండెకరాలు ఇచ్చినట్టు పాశం శ్రీనివాస్ దర్యాప్తులో వెల్లడించాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ వేరే వ్యక్తి పేరుతో ఉండడంతో ఆ బినామీ ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక మధుకర్ రెడ్డే ఆయన బినామీ అయి ఉండవచ్చని అధికారులు ఆయనను విచారించారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని 154 ఎకరాల కబ్జా కేసును విచారిస్తున్న భువనగిరి కోర్టుకు సిట్ అధికారులు సోమవారం నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ద్వారానే ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి.

మరోవైపు నయాం కేసులో సిట్ దర్యాప్తు ముందుకు సాగటం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులుగా కేంద్ర, తెలంగాణ హోంశాఖలు, తెలంగాణ డీజీపీ, సీబీఐలకు మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayeem Encounter  SIT inquiry  leaders names  political links  

Other Articles