మాజీ ప్రధాన న్యాయమూర్తికి.. ‘సుప్రీం’ అసాధరణ పిలుపు.. SC summons Katju over Fb post on Soumya rape case

Sc asks ex judge markandey katju to show up and justify blog

Markandey Katju, justice katju, markandey katju, soumya rape-cum-murder case, soumya murder case, kerala, supreme court, Sowmya rape case, Supreme Court, Supreme Court of India, katju

Katju, in his Facebook post on September 16, had criticised the judgment, saying it needed to be reviewed in open court since it was “regrettable that the court has not read Section 300 carefully.

మాజీ ప్రధాన న్యాయమూర్తికి.. ‘సుప్రీం’ అసాధరణ పిలుపు..

Posted: 10/18/2016 12:52 PM IST
Sc asks ex judge markandey katju to show up and justify blog

దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సహా జిల్లా కోర్టుల వరకు ఏ న్యాయస్థానం తీర్పును వెలువరించినా.. వాటిపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని, తీర్పు అనుకూలంగా రాలేదని భావించే వారు ఉన్నత న్యాయస్థానాలను అశ్రయించే అవకాశం కూడా మన దేశ న్యాయవ్యవస్థ మనకు కల్పించింది. అయితే దేశ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి.. విధులు నిర్వర్తించిన మాజీ న్యాయమూర్తికి ఈ చిన్నవిషయం కూడా తెలియదా..? అన్న ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి.

ఆయన పయనించిన బాటను ఒక్కొక్కరుగా అన్వయిస్తే.. ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయన్న విషయం కూడా అర్థం చేసుకోలేదు ఆయన. సమాజంలో వాటి ప్రభావం ఎలా వుంటుందన్న ముందస్తు అలోచన లేకుండా.. తనకు అనిపించింది కదా అని ఏకంగా అత్యున్నత న్యాయస్థానాల తీర్పులపై బహిరంగ కామెంట్ చేశారు. అయితే ఇలా చేయడం కూడా తప్పే. అయినా తాను మాజీ సీజేఐ హోదాలో మాట్లాడుతున్నానని మార్కేండయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

సంచలనం సృష్టించిన కేరళ సౌమ్య రేప్, హత్య కేసులో సుప్రీం వెలువరించిన తీర్పులో ప్రాథమిక తప్పులున్నాయని మార్కండేయ కట్జూ సెప్టెంబర్‌లో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది.మాజీ సీజేగా విధులు నిర్వర్తించిన వ్యక్తిగా, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా కొనసాగుతున్న మార్కేండేయ కట్జూను తమ తీర్పులను తప్పుబట్టినందుకు గాను అయనను తమ ముందు హాజరుకావాలని కోరింది. అసాధారణ రీతిలో దేశంలోనే తొలిసారిగా ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జిని తన ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

అందుకే ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’ అని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యూయూ లలిత్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చే ముందు జడ్జీలు సెక్షన్ 300ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, ఈ కేసును బహిరంగ కోర్టులో పునర్విచారించాలని కట్జూ అనడం విచారకరమని అభిప్రాయపడింది. ఈ మేరకు కట్జూకు కోర్టు నోటీసులిచ్చింది. మాజీ జడ్జిని ఇలా ఆదేశించడం ఇదే తొలిసారని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Markandey Katju  Sowmya rape case  Supreme Court  Supreme Court of India  

Other Articles