మోదీ-పుతిన్ తలుపులేసుకుని ఏం చేశారంటే... | PM Modi Putin begin closed door bilateral meeting at BRICS

Pm modi putin begin closed door bilateral meeting at brics

BRICS 2016, Goa BRICS meeting, BRICS 2016 modi, Modi speech at BRICS 2016, PUTIN MODI at brics

PM Modi Putin begin closed door bilateral meeting for key agreements at BRICS.

పాత స్నేహితుడు చాలా బెటర్ అంటున్న మోదీ

Posted: 10/15/2016 03:41 PM IST
Pm modi putin begin closed door bilateral meeting at brics

ఓవైపు అగ్ర రాజ్యాలతో స్నేహం కొనసాగిస్తున్న దేశ ప్రధాని మోదీ, మరోవైపు పాక్ లాంటి దాయాది దేశాలకు గట్టి బుద్ధి చెబుతూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా గోవాలో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌ుతున్న బ్రిక్స్ స‌మాఖ్య‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సును వాడుకుంటున్నాడు కూడా. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలను వారికి వివరిస్తూనే, ఇంకోవైపు దేశాభివృద్ధి కోసం కావాల్సిన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాడు.

ఇక ఈ సమావేశాల కోసం వ‌చ్చిన‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. ర‌ష్యా, భార‌త్‌ ద్వైపాక్షిక అంశాల‌పై చర్చలు జ‌రిపారు. రష్యా మన పాత మిత్రుడు. కొత్తగా ఇద్దరిని ఎంచుకోవటం కన్నా పాత స్నేహితుడు, మన దగ్గరి వాడు మనకు ఒక్కడు చాలు కదా అంటూ రష్యాను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాడు. వారి కోసం మన తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని పరోక్షంగా పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.

అనంత‌రం భార‌త్-ర‌ష్యా మ‌ధ్య ఇరు దేశాల అగ్ర నేతల సమక్షంలో 10 కీల‌క ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండ‌లి-రష్యా మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. అంతేగాక, రెండు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈడీబీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ త‌ర‌ఫున ర‌ష్యాతో అవ‌గాహ‌న ఒప్పందంపై ఏపీ అధికారి జాస్తి కృష్ణ సంత‌కం చేశారు. ఏపీలో ర‌వాణా, నౌక నిర్మాణ రంగాల‌పై అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది.

భారత్ లో ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల అభివృద్ధిలో ర‌ష్యా స‌హ‌కారం అందించనుంది. నాగ‌పూర్- సికింద్రాబాద్ మ‌ధ్య హై స్పీడ్ రైళ్ల‌పై ర‌ష్యాతో ఒప్పందం కుదిరింది. హ‌ర్యానా అధికారి తమ రాష్ట్రంలో స్మార్ట్ సిటీల ఏర్పాటుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. గ్యాస్ పైప్ లైన్లు, ఎడ్యుకేష‌న్‌, విద్యుత్తు రంగాలపై ప‌లు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి.

ప్రధానంగా ఎనర్జీ, డిఫెన్స్ కు సంబంధించిన ఒప్పందాలకు వీరు పెద్ద పీట వేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇవే...

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుకు రవాణా వ్యవస్థకు సహకారం
2. ఆంధ్రప్రదేశ్ లో షిప్ బిల్డింగ్
3. హర్యాణాలో స్మార్ట్ సిటీస్
4. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైన్ లైన్ ఏర్పాటుకు సంబంధించి సంయుక్త అధ్యయనం
5. రాస్ నెఫ్ట్, ఎస్సార్ మరియు ఓఎన్జీసీల మధ్య డీల్
6. మౌలికవసతుల నిధి
7. రైల్వేలు
8. కామోవ్ కేఏ226 హెలికాప్టర్ల తయారీ
9. ఇస్రోకు సంబంధించిన ఒప్పందం
10. ద్వైపాక్షిక వ్యాపారంపై ఎంఓయూ
11. సైంటిఫిక్ డెవలప్ మెంట్ పై ఎంఓయూ
12. పెట్రోలియం ఎనర్జీ
13. అంతర్జాతీయ సమాచారం యొక్క రక్షణ
14. నాలుగు ఫ్రిగేట్ (వార్ షిప్)ల కొనుగోలు
15. కూడంకుళం అణుకేంద్రంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BRICS 2016  Goa  PM Modi  Russia president Putin  

Other Articles