బంధు ప్రీతితో ఆ రాష్ట్ర మంత్రి ఏం చేశాడు? | Kerala minister Jayarajan dropped from govt for nepotism

Tainted kerala minister jayarajan dropped from govt for nepotism

Kerala minister Jayarajan resigned,Tainted Kerala minister , nepotism Kerala minister

Tainted Kerala minister Jayarajan dropped from govt for nepotism.

అవినీతి రాష్ట్రమంత్రిని చివరికి తీసేశారు

Posted: 10/15/2016 08:31 AM IST
Tainted kerala minister jayarajan dropped from govt for nepotism

గత నాలుగు నెలలుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆ అవినీతి మంత్రిని తొలగించాడు. కేరళ ముఖ్యమంత్రి పీనరాయి విజయన్ తన కేబినెట్ నుంచి పరిశ్రమల శాఖ మంత్రి ఇ.పి.జయరాజన్ ఉద్వాసన పలికాడు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కీలక నియామకాల్లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శుక్రవారం జరిగిన సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో విమర్శలకు తలొగ్గి తాను రాజీనామా చేస్తున్నానని జయరాజన్ ప్రకటించారు. అయితే, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తీసుకున్న దృఢ నిర్ణయమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీపీఎంతో పాటు ఎల్‌డీఎఫ్ పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇక జయరాజన్ తప్పులు ఒప్పుకున్న తర్వాతే ఆయన్ని తీసేశామని కేరళ సీపీఎం సెక్రటరీ బాలకృష్ణన్ తెలిపాడు. గతంలో కాంగ్రెస్ లో 8 మంది మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని, ఇప్పుడు తమ పార్టీ చిత్తశుద్ధి చూపించుకుందని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Minister  Jayarajan  resign  CPM mnister  

Other Articles