దేశాభివృద్దికి మాజీ ప్రధాని సరళీకృత విధానాలే దోహదం PV Narasimha Rao was a reformist saya Rangarajan

Pv narasimha rao was a reformist saya rangarajan

pv narsimha rao, manmohan singh, rangarajan, reformist, pv architect of reforms, congress party, IMF, narsimha rao, c rangaragan, political support,

"PV Narasimha Rao was a reformist. He was the architect of reforms and gave the political support that was needed," said Rangarajan, who was the deputy governor of RBI in 1991.

దేశాభివృద్దికి మాజీ ప్రధాని సరళీకృత విధానాలే దోహదపడ్డాయి

Posted: 10/14/2016 10:24 AM IST
Pv narasimha rao was a reformist saya rangarajan

దేశం అర్థికంగా అభివృద్ది సాధించడానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ఆయన హయాంలో కేంద్ర అర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ తీసుకోచ్చిన అర్ధికవిధానాలపై ఆయనను అందరూ ప్రశంసిస్తారని, అయితే అందుకు కారణమైన పివీ నరసింహారావును మాత్రం దేశప్రజలు మర్చిపోయారని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని, రెండంకెల ఆర్థికాభివృద్ధి సాధించడానికి కారణం పివీ నరసింహారావు తీసుకున్న విధానాలే కారణమని ఆయన అన్నారు.

ప్రధానిగా పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన తీరుపై ప్రముఖ పాత్రికేయుడు సంజయబారు రాసిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకంపై జరిగిన చర్చాగోష్టి కార్యక్రమానికి హజరైన ఆయన.. పివీ దేశానికి అర్థిక సంస్కరణలు అందించిన మహా సంస్కర్త అని కోనియాడారు. సంకీర్ణ ప్రభుత్వంలో తన సొంత పార్టీకి చెందిన నేతలే ఆయన నిర్ణయాలను వ్యతిరేకించిన తరుణంలో.. తన నిర్ణయాలను నిద్వందంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుని పీవీ సాహసం చేశాడుని, అందుకే ఆయన అర్థిక సరళీకృత విధానాల అర్టిటెక్ట్ అని రంగరాజన్ పెర్కోన్నారు.

ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌కు వచ్చినప్పటికీ ఆయన ధైర్యం చేయలేకపోయారన్నారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన హీరో పీవీయేనని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతోపాటు నెహ్రూ విదేశీ విధానాన్ని పీవీ పూర్తిగా మార్చేశారన్నారు. ఆర్థికాభివృద్ధిని, గ్రామీణాభివృద్ధిని ఏక కాలంలో సాధించే ద్విముఖ వ్యూహాన్ని పీవీ అవలంబించారని తెలిపారు. దేశ ఆర్థిక రంగం ముఖచిత్రాన్ని పీవీ సమూలంగా మార్చేశారని పుస్తక రచయిత సంజయ్‌బారు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv narsimha rao  manmohan singh  rangarajan  reformist  pv architect of reforms  congress  

Other Articles