సోషల్ మీడియాలో ట్రంప్ మరో వీడియో వైరల్ Donald Trump's Cynical Exploitation of Rape Culture

Donald trump once told 14 year old girls in a couple of years i ll be dating you

donald trump trump, women groping allegations, us, united states, us, us elections, us polls, us presidential elections 2016, hillary clinton, clinton, us news

Donald Trump asked two girls how old they were. When they said they were 14, Trump, then 46, replied, “Wow! Just think — in a couple of years, I'll be dating you."

ITEMVIDEOS: సోషల్ మీడియాలో ట్రంప్ మరో వీడియో వైరల్

Posted: 10/14/2016 08:04 AM IST
Donald trump once told 14 year old girls in a couple of years i ll be dating you

ఇప్పటికే తన సొంత పార్టీకి చెందిన సభ్యుల నుంచే విమర్శలను ఎదుర్కోంటున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. మరో మారు ముప్పేట దాడికి గురయ్యారు. తన జోలికి వస్తే మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షబరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ కు సంబంధించిన టేపులను తాను బయట పెడతానని సూటిగా హెచ్చరించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మరో వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. అందులో మహిళలపై ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ తీరును పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి విడుదలవుతున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా 1992 నాటి వీడియో ఒకటి బయటపడి వైరల్ అయింది. ఓ యువతిని ఉద్దేశించి మరో పదేళ్లలో ఆమెతో డేటింగ్ చేస్తానని ట్రంప్ అందులో పేర్కొన్నారు. 2005లో మహళలపై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇటీవల బయటపడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

తాజాగా సీబీఎన్ న్యూస్ చానల్ ట్రంప్‌కు సంబంధించిన 1992 నాటి వీడియోను ప్రసారం చేసింది. అందులో ట్రంప్ ఓ మహిళను ఉద్దేశించి ‘మరో పదేళ్లలో ఆమెతో డేటింగ్ చేస్తా’ అని పేర్కొన్నారు. అప్పటికి ట్రంప్ వయసు 46 ఏళ్లు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాంలో పాల్గొన్న ఓ యువతిని రియాలిటీ టీవీస్టార్ ‘ఎస్కలేటర్ ఎక్కుతున్నావా’ అని అడిగింది. దీనికి ఆమె ‘అవును’ అని సమాధానం చెప్పింది.

ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ‘మరో పదేళ్లలో ఆమెతో నేను డేటింగ్ చేస్తా. మీర నమ్మగలరా?’ అన్నారు. తాజా వీడియోతో ఆయన పరువు మరింత దిగజారింది. ఆయన బారిన పడిన మహిళలు ఇప్పటికే ట్రంప్‌కు వ్యతిరేకంగా మీడియాకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న వీడియోలు ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ వీడియోలు ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us presidential elections 2016  hillary clinton  donald trump  viral video  

Other Articles