లేట్ నైట్ పార్టీ నుంచి క్యాబ్ లో ఇంటికి వస్తుంటే.. Cab driver 'abducts' woman after late night party

Cab driver abducts woman after late night party

C-Scheme club, roommates, Woman abducted, physical assult on woman, harrassment on womenn, violence on women, sexual assult on women, DCP Ashok Gupta, Vishwa Karma, late-night party, Daulat Pura area, Murlipura area, Milan cinema, Harmada highway, Jaipur police commissioner Sanjay Agarwal, Jaipur, Rajasthan, cime

A cab ride back home after a party turned into a nightmare for a 22-year-old woman who was allegedly abducted and physically assaulted by the driver in the Vishwa Karma area of Jaipur

లేట్ నైట్ పార్టీ నుంచి క్యాబ్ లో ఇంటికి వస్తుంటే..

Posted: 10/08/2016 01:31 PM IST
Cab driver abducts woman after late night party

యువతులు పాశ్యాచ సంస్కృతి మోజులో పెడదారి పడుతున్నారు. పీకల దాకా మధ్యం సేవించి యువతులు తాము ఎక్కిన కారు ఎక్కడికెళ్తుందో కూడా చూసుకోకపోవడంతో వారి ఛేదు అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుని, తిరిగి ఇంటికి క్యాబ్‌లో వస్తున్న ఓ యువతిని ఆ క్యాబ్ డ్రైవర్ అపహరించి, ఆమెపై లైంగిక దాడి యత్నించాడు, ఈ క్రమంలో నిందితుడు అమెపై దాడి కూడా చేశాడు. అయితే అమె అదృష్టం బాగుండి అత్యాచార యత్నం నుంచి బయటపడింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ విశ్మకర్మ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని జైపూర్ నగరానికి చెందిన ఓ యువతి తన ఇద్దరు రూం మేట్లతో కలిసి నగరంలోని ఓ క్లబ్‌లో పార్టీకి వెళ్లింది. పార్టీ ముగుస్తోందనగా ఆ ముగ్గరిలో ఒకరు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. కానీ, ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో క్యాబ్ వివరాలు ఆమెకు రాలేదు. దాంతో క్లబ్ బయటకు వచ్చి క్యాబ్ కోసం చూశారు. ఆ సమయంలో తనను తాను ఉబర్ డ్రైవర్‌గా చెప్పుకొన్న ఓ వ్యక్తి వాళ్ల వద్దకు వచ్చాడు. యువతులలో ఇద్దరు వెనక కూర్చోగా, మరో యువతి ముందు సీట్లో కూర్చుంది.

తమను మురళీపురా ప్రాంతానికి తీసుకెళ్లమంటే ఎటునుంచో తిప్పి.. చివరకు విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. హర్మద హైవే మీద మిలన్ థియేటర్ సమీపంలో టైరు పంక్చర్ అయిందంటూ పక్కకు ఆపాడు. వెనకాల కూర్చున్న ఇద్దరినీ దిగమన్నాడు. వాళ్లు దిగగానే కారులో ఉన్న మరో యువతితో పరారైనట్లు విశ్వకర్మ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ కన్వర్ పాల్ సింగ్ తెలిపారు. కొంతదూరంలో ఒక హోటల్ కనిపించడంతో అక్కడకు వెళ్తుండగా.. పోలీసు పెట్రోల్ యూనిట్ వాళ్లను ఆపి ప్రశ్నించింది.

దాంతో వాళ్లు ఏడుస్తూ మొత్తం విషయం చెప్పారు. పెట్రోలింగ్ పోలీసులు గాలిస్తూ వెళ్లగా.. చివరకు దౌలత్‌పురా ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్ కింద క్యాబ్ పార్క్ చేసి కనిపించింది. పోలీసులను చూడగానే డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి ముఖం మీద గాయాలు కనిపించాయి. దాంతో ఆమెను లైంగికంగా వేధించేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : C-Scheme  Woman abducted  Vishwa Karma  late-night party  Daulat Pura area  Jaipur  Rajasthan  cime  

Other Articles