సర్జికల్ స్ట్రయిక్స్ పై అక్షయ్ కుమార్.. సూటిగా.. సుత్తిలేకుండా.. Think about Army, not about ban on artistes: Akshay Kumar

Angry akshay kumar s patriotic call to fellow indians argue later first think about our army their families

akshay kumar, akshay kumar facebook video, akshay kumar on solider, akshay kumar uri attacks, uri attacks akshay kumar, uri attacks akshay, akshay uri attacks, akshay kumar latest news, akshay kumar latest updates, entertainment news, salman khan, pakistani artists, shiv sena,pakistani artists bollywood, fawad khan, bollywood news, indian motion picture producers association, imppa, india news, latest news

Do you think army families are concerned about whether a film will release or not or will an artist be banned or not? says an angry Akshay Kumar

ITEMVIDEOS: సర్జికల్ స్ట్రయిక్స్ పై ప్రముఖ నటుడు. సూటిగా.. సుత్తిలేకుండా..

Posted: 10/07/2016 08:04 AM IST
Angry akshay kumar s patriotic call to fellow indians argue later first think about our army their families

ప్రపంచంలో ఏ దేశంలోనూ నెలకొనని విభిన్నమైన పరిస్థితి.. ఉరి ఘటన తరువాత మన దేశంలో నెలకొందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నాడు. ఉరి ఘటన, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వెలువడుతున్న కథనాల నేపథ్యంలో ఆయన లేటుగా స్పందించింనా.. సూటిగా.. సుత్తిలేకండా తన మదిలో వున్న విషయాన్ని తన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. తాను ఈ ఘటనలపై ఒక ప్రముఖ నటుడిగానో లేక సెలబ్రిటీగానో స్పందించడం లేదని, ఒక అర్మీ అధికారి తనయుడిగా తాను తన మనస్సులోని వున్న ప్రశ్నలను బయటపెడుతున్నానని అన్నారు.

ఉరీ ఘటన జరిగిన వెంటనే పలువరు పాకిస్థాన్ నటులను బ్యాన్ చేయాలని అడుగుతుండగా, మరికోందరు సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ, ఎలా జరిగాయో అధారాలను బయటపెట్టాల్సిందిగా డిమాండ్లు రావడం.. ఇంకోందరు యుద్దం జరుగుతుందేమోనని అందోళన చెందడంపై అయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది యావత్ జాతి సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ప్రస్తతం అలోచించాల్సింది ఉరీ ఘటనలో అమరులైన 19 మంది జవాన్ల గురించని అయన దేశప్రజలకు సూచించారు.

ఈ దాడిలో 24 ఏళ్ల నితన్ యాదవ్ దేశ రక్షణలో భాగంగా తన ప్రాణార్ఫణ చేశాడని, అది భారత జాతి గుర్తు చేసుకోవాల్సింది పోయి.. రాజకీయాలు, పాకిస్తాన్ నటులు బహిష్కరణల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వాదనలు తరువాత ముందుగా అమరులైన అర్మీ జవాన్ల గురించి, వారి కుటుంబాల గురించి అలోచిండీ అని ఆయన విన్నవించారు. దేశంలో చోటుచేసుకుంటున్న విపరీత వాదనలతో అమరులైన జవాన్ల కుటంభసభ్యులతో పాటు అర్మీతో తమ పనిచేస్తున్న వారి కుటుంబసభ్యలు ఎలా భావిస్తారని అయన నిలదీశారు.

సినిమాలు ఆడతాయా? లేదా? నటులపై నిషేధం విధిస్తారా? లేదా? అనే ఆలోచన సరికాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జవాన్ల గురించి. వారి భవిష్యత్ గురించి. అంతేకాని వారిని, వారి త్యాగఫలాలను విస్మరించి అనవసర వాదనలకు తెరతీయడం సబబుకాదని అన్నారు. అర్మీ సరిహద్దులో దేశానికి రక్షణగా, దేశప్రజల ప్రాణాలకు కపాలా కాస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ సంతోషంగా వున్నామని, లేకపోతే ఉగ్రవాద ఘాతుకాలతో దేశం భీతిల్లిపోయేదని ‘‘జైహింద్’’ అని వీడియోలో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshay kumar  facebook video  uri attack  soliders  surgical strikes  pakistan artists  

Other Articles