ఇండియన్ ఆర్మీ దాడులపై.. నెట్ జనుల అభినందనలు వెల్లువ India's Surgical Strike In PoK: Twitter Flooded With Reactions

India s surgical strike in pok twitter flooded with reactions

Indian Army, LoC, Pakistani territory, DGMO, attacks on terrorists, surgical strikes, Twitter, social media, amit shah,arvind kejriwal,surgical strike,india,pakistan,uri attacks,terror attacks,india-pakistan war, breaking news, pakistan territory, Ranbir singh, Lt. Gen. Ranbir Singh

Minutes after Lt Gen Ranbir Singh announces that Indian Army conducted surgical strikes on terror launch pads across the Line of Control, social media site Twitter got flooded with reactions.

ఇండియన్ ఆర్మీ దాడులపై.. నెట్ జనుల అభినందనలు వెల్లువ

Posted: 09/29/2016 01:52 PM IST
India s surgical strike in pok twitter flooded with reactions

అనునిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ మన దేశ రక్షణ రంగానికి కంట్లో నలుసుగా మారిన దాయధి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత రక్షణ దళాలు చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడిన ఘటన వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వార్తలపై సోషల్ మీడియాలో దేశప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నెట్ జనులు అర్మీకి అభినందనలు తెలుపుతూ.. మీ వెంటే మేముంటామంటూ భరోసాతో చెబుతున్న మెసేజ్ వైరల్ గా మారింది.

ఇటు నెట్ జనులతో పాటు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని భరోసాయిచ్చారు. సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేశారు.ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడి గర్వకారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదానికి మద్దతు మానునోవాలని పలుమార్లు దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినా దాయాది దేశం తన వైఖరిని మార్చుకోలేదన్నారు.

‘భారత్ మాతాకి జై. జాతి యావత్తు సైనం వెనుక ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని, దానికి తగిన సమాధానం చెప్పాల్సిన అసవరముందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి భారత్ సైన్యం నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘తీవ్రవాదులు అందరికీ ఇది తగిన గుణపాఠం. మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు మాకు ఉంద’ని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ అన్నారు.

ఇక భారత సైన్యం దాడులకు దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారో అదే చేస్తున్నారని బీజేపీ నాయకుడు రాం మాధవ్ ట్వీట్ చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను శిక్షించడం మొదలైందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian army  surgical strikes  pakistan territory  Ranbir singh  twitter  social media  

Other Articles