పవన్ సాయం కోసం వస్తే అరెస్ట్ చేశారు... | woman protest at Pawan Kalyan Home for help

Woman protest at pawan kalyan home for help

Woman protest at Pawan Kalyan's house, Woman Hul Chul at pawan's home, Woman seeks pawan help, Pawan Kalyan House, woman arrested at pawan kalyan house, pawan kalyan helping nature

Woman protest at Pawan Kalyan's house for help from Four months.

సాయం చేయాలంటూ పవన్ ఇంటి వద్ద యువతి...

Posted: 09/29/2016 10:31 AM IST
Woman protest at pawan kalyan home for help

టాలీవుడ్ అగ్రహీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఇంటి ముందు హల్ చల్ చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు చాలా కష్టాలు ఉన్నాయని, పవన్ అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ కోరుతూ సదరు యువతి కొంత కాలంగా జూబ్లీహిల్స్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ తిరగుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి పవన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని సిబ్బందితో ఏకంగా వాగ్వాదానికి దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కొండాపూర్‌కు చెందిన జ్యోతి నాలుగు నెలలుగా నందగిరి హిల్స్‌లోని పవన్‌ కళ్యాణ్ నివాసానికి వస్తోంది. అయితే తొలిరోజే సార్ లేరని, నెల రోజుల తర్వాత వస్తారని చెప్పి పంపినా ప్రతిరోజూ ఆమె అక్కడికి వస్తోంది. పవన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా భద్రతా సిబ్బంది నిరాకరిస్తూ వస్తున్నారు. బుధవారం కూడా ఆమె ఉదయం వచ్చి సాయంత్రం వరకు పవన్‌ ఇంటి ముందున్న రోడ్డుపై బైఠాయించింది. తాను పవన్‌ను కలవాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.

పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని చెప్పినా వినకుండా అక్కడే కూర్చుంది. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అదించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారిస్తుండగా.. పోలీసుల తీరుకు నిరసనగా.. ఆమె నడి రోడ్డుపై కూర్చొని ఆందోళన చేసింది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మీడియాతో జ్యోతి మాట్లాడారు. తాను ఎలాంటి న్యూసెన్స్ చేయకపోయినా.. విషయం పవన్ దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది వ్యవహారిస్తున్నారని, ఇప్పుడు పోలీసులను పిలిపించి తన పై దాడి చేశారని.. అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. అంటూ ఆరోపిస్తున్న జ్యోతిని సముదాయించి స్టేషన్‌కు తరలించారు. ఆపై ఆమె అడ్రస్ తెలుసుకుని ఇంటివద్ద వదిలేశారు. కాగా, విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇప్పుడు తాపీగా చెబుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  Pawan Kalyan  home  help  arrest  

Other Articles