ప్రతిపక్షాల బలంతోనే సిద్ధ రామయ్య సాహసం | After all party meeting Karnataka govt not to release water to TN

After all party meeting karnataka govt not to release water to tn

Karnataka All Party meeting on Cauvery Dispute, Cauvery Water Issue, Siddaramaih no for release water, Karnataka govt vs supreme court, Chaos in Karnataka again for SC decision, SC cauvery decision

After all party meeting Karnataka govt not to release Cauvery water to Tamil Nadu.

ప్రతిపక్షాల అండతో రెచ్చిపోతున్న సీఎం

Posted: 09/28/2016 03:42 PM IST
After all party meeting karnataka govt not to release water to tn

కావేరి జలాల వివాదంపై వివాదం మరోసారి ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటిని వదిలే విషయమై మ‌రోసారి సుప్రీంకోర్టుకు వెళ్లిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ దెబ్బ‌త‌గిలిన సంగతి తెలిసిందే. తాము ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాట‌క‌ విడుదల చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయ‌డంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. అయితే సుప్రీం ఆదేశాలిచ్చిన సరే క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఈ యవ్వారాన్ని బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తాడో పేడో తేల్చాలని చూస్తున్నారు. కాగా, సుప్రీం ఆదేశాల‌పై చ‌ర్చించిన క‌ర్ణాట‌క రాజ‌కీయ పార్టీలన్నీ త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయ‌రాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తామని ప్రకటించాయి కూడా. దీంతో అఖిల‌ప‌క్షంలో ఇదే అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, దాన్నే పాటించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుందన్న సంకేతాలు అందుతున్నాయి.

Cauvery All Party Meeting

కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు వేల క్యూసెక్కులను కాకుండా, రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. నదిలోనే నీరు లేనప్పుడు తామేం చేయగలమంటూ సీఎం సిద్ధరామయ్య మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని, ఆపై రాష్ట్రపతిని కలుశాక ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించాడు కూడా. కానీ, ఉభయ సభలు తీర్మానం చేసిన మా ఆదేశాలు పాటించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలతో బెంగళూరులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలతో ర్యాలీలు జరుగుతుండటంతో 144 సెక్షన్ విధించారు. కాగా, తాజా ఆదేశాల ప్రకారం 28, 29 తేదీల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా రిజర్వాయర్లను తెరిచి ఉంచాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ లో తీసుకనే నిర్ణయం అమలు చేసే సాహసం ప్రభుత్వం చేస్తుందా అన్నది మరికాసేపట్లో తేలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cauvery Dispute  Karnataka  CM Siddaramaiah  All Party Meeting  Tamil Nadu  

Other Articles