టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు IT Raids on MLA Modugula Venugopala Reddy

It raids on tdp mla modugula venugopala reddy house and offices

MLA Modugula Venugopala Reddy, Guntur West Zone MLA, MLA modugula Venugopal Reddy, IT raids, income tax attacks, IT Notices, Bangaluru, Real Estate Ventures, modugula house and offices

The IT officials have conducted raids on MLA Modugula Venugopala Reddy house and it is found that discrepancies have taken place in the business and real estate ventures of his at Bengaluru.

మోదుగులకు త్వరలో ఐటీ నోటీసులు..? కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Posted: 09/28/2016 07:31 AM IST
It raids on tdp mla modugula venugopala reddy house and offices

టీడీపీ నేత, గుంటూరు వెస్ట్ నియోజకవర్గపు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఆదాయపన్నుశాఖ అధికారులు త్వరలో నోటీసులు అందించనున్నారని సమాచారం. మోదుగుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంతో దాడులు నిర్వహించిన ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఐదు బృందాలుగా విడిపోయిన  మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు.
 
ఈ నేపథ్యంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన బెంగుళూరులోని పలు రియల్ ఎస్టేట్ వెంచర్లలో అతిక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తులు ఇటు గుంటూరు సహా బెంగళూరులో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బెంగళూరులోని ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు సమాచారం.
 
బుధవారం మోదుగులకు చెందిన హైదరాబాద్, గుంటూరు కార్యాలయాల్లో కూడా ఈ దాడులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మోదుగుల బెంగళూరులో అందుబాటులో లేని సమయంలో ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయా, లేక రాజకీయకోణంలో జరిగాయా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదుగుల అందుబాటులో లేకపోవడంతో ఐటీ అధికారులు ఆయన భార్య వద్ద నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh