నగరం పరిస్థితిపై గరం గరం | KCR review meeting on Hyderabad Heavy Rains

Kcr review meeting on hyderabad heavy rains

KCR on Hyderabad rains, KCR review on Hyderabad floods, KCR on Hyderabad Floods, KCR review on Hyderabad rains

KCR review meeting on Hyderabad Heavy Rains.

హమ్మయ్యా... వర్షాలపై సీఎంసారూ స్పందించారు

Posted: 09/24/2016 05:35 PM IST
Kcr review meeting on hyderabad heavy rains

తెలంగాణ సీఎం కేసీఆర్ వర్షాలపై కదిలారు. ఓవైపు నగర వాసులు నరకం చవిచూస్తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టనట్లు వ్యవహారిస్తున్నారన్న నేపథ్యంలో ఆయనే సీన్లోకి వచ్చేశారు. తెలంగాణ‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు జిల్లాలను భారీగా వ‌ర‌ద‌లు ముంచెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ఐదు రోజుల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటుందని వాత‌వర‌ణ శాఖ కూడా హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో వర్షాలపై మంత్రులతో టచ్ లో ఉన్న ఆయన నేరుగా రంగంలోకి దిగారు.

ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం హైదరాబాద్ కి వచ్చిన తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ స‌చివాల‌యంలో ఉన్న‌త‌స్థాయి సమీక్ష స‌మావేశం నిర్వహిస్తున్నారు. రెండున్నర గంటలకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో పాటు ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ అధికారులు కూడా పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా అధికార గణంపై ఆయన కాస్తింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇంతదాకా వచ్చేదాకా చూసుకున్నారంటూ అసహానం వ్యక్తం చేశారంట. ఇక హైద‌రాబాద్‌ స‌హా అన్ని జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చిస్తున్నారు. వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన‌ పంట‌లు, రోడ్ల పరిస్థితిపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, పాటించాల్సిన విధుల‌ ప్ర‌ణాళిక‌పై కేసీఆర్ సూచ‌న‌లు చేస్తున్నారు. స‌మావేశం అనంత‌రం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడ‌నున్నారు. మ‌రోవైపు ఆర్మీ బృందాలు ఈరోజు హైదరాబాద్‌లోని ప‌లు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  Hyderabad  Heavy Rains  

Other Articles