మ్యాన్ హోల్ లో పడ్డ యువకుడు చనిపోలేదు | Man Fall Down Into the Manhole at Nacharam survived

Man fall down into the manhole at nacharam survived

Man Fall Down Into the Manhole at Nacharam, Man Fall Down Into the Manhole video, Man Fall Down Into the Manhole alive, Man Fall Down Into the Manhole channels, Media threatens people with Hyderabad rain telecast

Man Fall Down Into the Manhole at Nacharam survived. But Channels telecast as that man was died.

ITEMVIDEOS:మ్యాన్ హోల్ లో యువకుడు... మన చానెళ్లు ఏం చూపాయి?

Posted: 09/24/2016 11:50 AM IST
Man fall down into the manhole at nacharam survived

ఓవైపు వర్షాలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలంతా అయోమయంలో ఉన్న సమయంలో మన మీడియాలు వార్తలను ప్రసారం చేసే విధానం చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతోంది. ఇలాంటి సమయంలో భద్రతా చర్యలు, ప్రజలకు జాగ్రత్తలు లాంటివి కాకుండా, ఎంత సేపు ప్రభుత్వాన్ని దెప్పిపొడుస్తూ... సమస్యలను మరింత జఠిలం చేయాలనే చూస్తున్నాయి. హైదరాబాద్ అంటే ఓ అభద్రతా నగరం అన్న భావనను ప్రజల్లో పెంచుతున్నాయి. అద్భుతమైన వరద లాంటి విచిత్ర పదాలను వాడుతూ పిచ్చెక్కిస్తున్నాయి. ఇందుకు మచ్చుకు ఓ ఉదాహరణ...

నిన్న నాచారంలో ఉదయం తీవ్ర వర్షం కురిసింది. మ్యాన్ హోల్ మూత తెరిచి ఉండటంతో ఓ ట్రాలీ టైర్ అందులో ఇరుక్కుపోయింది. దానిని బయటికి తీసేందుకు కొందరు యువకులు సాయంగా వెళ్లారు. అంతలో బ్లూ షర్ట్ వేసుకున్న ఓ యువకుడు కూడా తన వంతుగా చేయి వేశాడు. అయితే టైర్ పైకి లేపే క్రమంలో ఒక్కసారిగా నీటి ఉదృత అతన్ని మ్యాన్ హోల్ లోకి లాగేసింది. అంతే అక్కడున్న మిగతా యువకులు కంగారుపడిపోయారు. అతని కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయిన యువకుడు. సాయం చేయాలని వెళ్లి అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలి. మంచి పని కోసం వెళ్లితే ప్రాణాలు పొగొట్టుకున్నాడంటూ చానెళ్లన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊదరగొట్టేశాయి. ఇక జనం కూడా పాపం యువకుడు అంటూ నిట్టూర్పు విడిచారు. ఇది టీవీ చానెళ్లు చూపింది. కానీ, ఆ యువకుడు ప్రాణాలతోనే బయటపడ్డాడు.

14 అడుగుల మ్యాన్ హోల్ లోకి వెళ్లిపోయిన రవి అనే యువకుడు మధ్యలో ఇనుప చువ్వలు అడ్డుకోవటంతో ఆగిపోయాడు. మిగతా యువకులు అప్రమత్తం అయ్యి లోపల ఉన్న అతన్ని బయటికి లాగి తీశాయి. కానీ, మన మీడియా మాత్రం కేవలం పడిపోయిన విజువల్స్ అరిగిపోయేలా పదే పదే చూపాయో తప్ప, అతన్ని రక్షించిన విషయాన్ని, అతని ప్రాణాలు నిలబడ్డ వార్తను మాత్రం హైలెట్ చేయలేకపోయాయి. అంతా టీఆర్పీ మోజు... ఏం చేస్తాం చెప్పండి. కొన్ని ప్రముఖ పత్రికలు ఈ ఉదయం దీనిపై పూర్తిగా కథనాలను ప్రచురించాయి. మీడియాకు చేసే విజ్నప్తి ఒక్కటే ఒక్క రెండు, మూడు రోజులు బాధితులను ఇంటర్వ్యూలతో విసిగించడం లాంటివి కాకుండా, కేవలం అప్రమత్తం(భయపెట్టడం లాంటిది) కాకుండా మీకు తోచినంత సాయం చేయండి చాలూ.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Fall Down  Manhole  Nacharam  survive  

Other Articles