తెలంగాణకు ఏపీ మంత్రి అలర్ట్ కాల్ | Devineni uma phone call to harish rao ove Pulichintala floods

Devineni uma phone call to harish rao ove pulichintala floods

Devineni uma phone call to harish rao, harish rao ove Pulichintala floods, Devineni uma alerts telangana, Pulichintala floods danger bell

Devineni uma phone call to harish rao ove Pulichintala floods.

తెలంగాణ డేంజర్ పై ఏపీ మంత్రి అలర్ట్

Posted: 09/22/2016 02:05 PM IST
Devineni uma phone call to harish rao ove pulichintala floods

ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నీటి పంపకాల విషయంలో ఒకరి ఫోన్లు మరోకరు కనీసం లిప్ట్ చేయలేదన్న ఫిర్యాదులు. నిన్న జరిగిన అపెక్స్ మీటింగ్ లో సైతం ఎడమొహం పెడమొహం. చెప్పేది ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్ల గురించి. ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుకునే తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే అది రాబోయే ప్రమాదం గురించి కావటం విశేషం.

పులిచింతల ప్రాజెక్టుకు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం మరికొన్ని గంటల్లో వస్తుందని, దీని ప్రభావంతో గుంటూరు జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావును ఏపీ మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం హరీశ్ రావుకు ఫోన్ చేసిన ఆయన, పులిచింతలకు వరద పెరిగితే రెండు రాష్ట్రాలకూ నష్టమేనని అన్నారు. వస్తున్న వరద నీటిని సమన్వయంతో కాపాడుకుందామని సూచించారు.

మాచర్ల, గురజాల, రెంటచింతల, వెల్దుర్తి తదితర మండలాలతో పాటు మిర్యాలగూడ పరిధిలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరంతా పులిచింతలకే వస్తుందని దేవినేని గుర్తు చేశారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా పులిచింతల ప్రాజెక్టును సంయుక్తంగా పర్యవేక్షిద్దామని సూచించారు. పులిచింతల వరదపై నల్గొండ జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలని దేవినేని చేసిన సూచనకు హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP irrigation Minister  Devineni Uma  Harish Rao  Pulichintala Alerts  

Other Articles