వెంటనే మీ డెబిట్, క్రెడిట్ కార్డు పిన్ మార్చుకోండీ Beware of calls from strangers seeking credit/debit card details

Banks alert on atm fraud ask customers to change pin

ATM frauds, Banks alert on ATM frauds, HDFC Bank, Federal Bank, DBS Bank, text messages, Skimming, ATM skimming, Cloning of ATM cards, HDFC Bank, ATM PIN,

Banks like HDFC Bank, Federal Bank and DBS have sent text messages to their customers to change their ATM PIN as ATM frauds are on the rise.

డెబిట్, క్రెడిట్ కార్డు పిన్ మార్చుకోండీ.. బ్యాంకు హెచ్చరికలు

Posted: 09/17/2016 02:39 PM IST
Banks alert on atm fraud ask customers to change pin

మీకు బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులున్నాయా..? అన్ లైన్ అకౌంట్, మెబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తుంటారా..? అయితే మీరు తక్షణం వెళ్లి మీరు పిన్ నెంబర్లను, పాస్ వర్డులను మార్చుకోండి. లేదంటే మీ కార్డు మీ వద్దే వున్నా.. మీ అకౌంట్ లోని డబ్బులు మాత్రం ధొంగల పాలవ్వడం గ్యారెంటీ. ఎందుకైనా మంచిది. ముందస్తుగా వెళ్లి మీ పిన్ నెంబర్లను మార్చుకోండి.. అంటూ బ్యాంకులు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. ఈ మేరకు  బ్యాంకు అధికారులు తమ కస్టమర్లకు ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు.

మరీ ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ  ఖాతాదారులను  ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన  ఏటీయం కుంభకోణాల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డుదారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ  ఖాతాదారులకు  సేఫ్ బ్యాంకింగ్ పై   అవగాహన  కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి.

కాగా  కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రం వద్ద కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ  అరెస్టయిన సంగతి తెలిసిందే. యావత్ ధేశంలోని 65 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లలో సుమారుగా 60 శాతం మంది వినియోగిస్తున్న బ్యాంకు ఏటీయం, క్రెడిట్ కార్డులు ఐస్కాంత స్ట్రిప్ లో తమ కస్టమర్ తాలుకు సమాచారంతో పాటు డాటాను పొందుపర్చింది. ఇది కిమ్మింగ్ కు లభ్యమయ్యే అవకాశాలు అధికంగా వున్నాయి. దీంతో అర్బీఐ అన్ని బ్యాంకులకు భద్రతాపరగా వుండే ఈఎంవీ తరహా ఫార్మెట్ లో డెబిట్, క్రెడిట్ కార్డులను అందజేయాలని కూడా అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banks  alert  ATM fraud  customers  change  PIN  Bank text messages  

Other Articles