హెచ్‌సీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య Another Student Commits Suicide in HCU

Another student commits suicide in hcu

Hyderabad Central University , student suicide, praveen, N, praveen mfa student, suicide, Master of Fine Arts student suicide, Rohit vemula, ambedkar studentes union leader, crime

A 20-year-old student from the Hyderabad Central University committed suicide by hanging himself in his hostel room.

హెచ్‌సీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య

Posted: 09/17/2016 01:34 PM IST
Another student commits suicide in hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గత ఏడాది అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకుడు రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడన్న వార్త విశ్వవిద్యాలయంలో కలకలం రేపింది. ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న నెల్లి ప్రవీణ్ కుమార్ ‘ఎల్’ హాస్టల్ లోని 204 గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అతడి ఆత్మహత్యపై సహచర విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు.

యూనివర్సిటీ అధికారుల కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ప్రవీణ్ రూమ్ మేట్ హాస్టల్ కు చేరుకున్నాడు. అయితే ప్రవీణ్ రూమ్ ఎంతకీ తెరవకపోవడంతో తన స్నేహితులకు సమాచారం అందించాడు. 204 గది వద్దకు చేరుకున్న విద్యార్థులు గది వెంటిలేటర్ ద్వారా రూమ్ లోపలికి చూడగా.. ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు ప్రవీణ్ ను వర్సిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కు ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన చికిత్స నిమిత్తం సిటీజన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు సిటీజన్ వైద్యులు నిర్ధారించారు.

అటు నుంచి ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య వార్త తెలియగానే యూనివర్సిటీ వీసీ పి. అప్పారావు హుటాహుటిన ఎల్ బ్లాక్కు చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంతా తెలియలేదని వీసీ అప్పారావు తెలిపారు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడని చెప్పారు. ప్రవీణ్ మృతి పట్ల యూనివర్సిటీ అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లోని జవహార్ నగర్. ప్రవీణ్ తండ్రి బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగి. మూడు రోజుల క్రితమే ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడినట్లు మృతుడి తమ్ముడు నవీన్ తెలిపాడు. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Central University  student suicide  praveen  mfa student  suicide  crime  

Other Articles