ప్రశాంతంగా కొనసాగుతున్న రాష్ట్ర బంద్.. DMK leader Stalin courts arrest, Kanimozhi detained by police

Dmk leader stalin courts arrest kanimozhi detained by police

dmk kanimozhi bandh, dmk leaders bandh, stalin court arrest, cauvery bandh, cauvery dispute, tamil nadu, tamil nadu bandh, tamil nadu, tamil nadu bandh, tamil nadu bandh live, tamil nadu cauvery bandh, cauvery issue, cauvery water issue, cauvery water dispute, cauvery, kaveri, cauvery river, karnataka, karnataka closed, karnataka police, tamil nadu police, national news, india news

Tamil Nadu bandh: The opposition parties including the DMK and Congress have supported the bandh and demanded a long-term solution to the Cauvery water sharing row

ప్రశాంతంగా కొనసాగుతున్న రాష్ట్ర బంద్

Posted: 09/16/2016 03:00 PM IST
Dmk leader stalin courts arrest kanimozhi detained by police

కావేరీ జల వివాదం పోరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మధ్య అగ్గిరాజేస్తుంది. కావేరి జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మద్య దాడులు, ప్రతిదాడులతో హింస జ్వలిస్తుంది. కన్నడ రాష్ట్రంలో తమ రాష్ట్రవాసులపై దాడులకు తెగబడటంతో దానికి నిరసనగా తమిళనాడులో వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ నేపథ్యంలో వాణిజ్య, ప్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి, అన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తారోడో వంటి నిరసన కార్యక్రమాలతో బంద్ కు మద్దతు ప్రకటించాయి.

డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీబంద్‌కు మద్దతు పలికాయి. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు.  అటు కాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా బంద్ కు సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో ఇవాళ తమిళ సినిమా షూటింగ్ లను నిలిపివేసింది. కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగాయి. తమిళనాడుకు చెందిన దలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. కాగా, కావేరి జలాల విషయంలో మనస్తాపానికి చెంది క్రితం రోజు వంటిపై కిరోసిన పోసుకుని అత్మహత్యకు యత్నించిన విఘ్నేష్ అనే యువకుడు అస్పత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మరణించాడు. దీంతో ఈ కేసులో పలువురు నేతలను అరెస్టు చేయాలని న్యాయస్థానం అదేశించింది.

* అన్నాసలైలో అందోళనలో పాల్గోన్న డీఎంకే ఎంపీ కనిమొళిని ముందస్తు జాగ్రత్తాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో వద్ద డీఎంకే నేత స్టాలిన్, నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

* సైదాపేట్ రైల్వే స్టేషన్లో రైతు నాయకుడు ఆర్‌పీ పాండ్యన్‌, డీఎంకే కార్యకర్తలతో కలిసి రైల్‌ రోకో నిర్వహించారు.

* వీసీరే నేత తిరుమవల్వన్, కార్యకర్తలను బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.  

* తిరుచ్చిలో రైల్ రోకోలో పాల్గొనడానికి వెళ్తున్న ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యులు వైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలతో ఏఎంయూ ట్రైన్ సర్వీసులు నిలిపివేశారు

* తంజావూరులో సీపీఐ నేత సీ. మహేంద్రన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

* డీఎంకే ఎమ్మెల్యే కార్తీక్, కార్యకర్తలతో కలిసి సింగనల్లూరులో రైల్ రోకో నిర్వహించారు.

* కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు

* ఐటీ కంపెనీలు, ప్రైవేటు కాలేజీలకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bandh  Cauvery water dispute  dmk  polictical parties  Tamilnadu bandh  

Other Articles