Five arrested for assaulting Sri Lankan envoy in Malaysia during anti-Rajapaksa stir

Five held over attack on sri lanka ambassador in malaysia

assult on sri lanka high commisiioner, assult on Ibrahim Ansar, Sri Lanka foreign ministry, kaulalampur airport, 5 held in sri lanka high commissioner assult case, Malaysia , crime , assault , KLIA, Former Sri Lankan president Mahinda Rajapaksa

Five people have been arrested over the assault on Sri Lanka’s High Commissioner in Malaysia, Ibrahim Sahib Ansar, at the Kuala Lumpur International Airport

ఆయనపై దాడి చేసిన ఐదుగురు.. పోలీసుల అదుపులోనే..

Posted: 09/06/2016 09:44 AM IST
Five held over attack on sri lanka ambassador in malaysia

మలేసియాలో శ్రీలంక రాయబారిపై దాడి జరిపిన ఐదుగురిని అక్కడి మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడిలో శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహిబ్ అన్సర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ పోర్టులోకి ఎంటరైన అన్సర్ తిరిగి తన కార్యాలయానికి చేరకుంటున్న క్రమంలో అయపపై గుర్తు తెలియని దుండగులు విరుచుకుపడ్డారు. అన్సర్ పై పిడిగుద్దులు కురిపించిన దుండగులు ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే కాస్తంత ఆలస్యంగా స్పందించిన మలేసియా పోలీసులు ఈ దాడికి సంబందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు దుండగులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన దుండగులు ఏ దేశానికి చెందిన వారన్న వివరాలను కౌలాలంపూర్ పోలీసులు వెల్లడించలేదు. అంతేకాకుండా దాడికి దారి తీసిన కారణాలపైనా వారు నోరు విప్పలేదు. శ్రీలంక మంత్రి దయా గయాజ్ సహా మాజీ అధ్యక్షులు మహింద్ర రాజపక్స తదితరులను ఆయన అప్పుడే శ్రీలంక విమానాన్ని ఎక్కించి వెనుదిరిగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న తమిళుల బృందం ఆయనపై దాడి చేసింది.

అయనకు ఎదురుగా వచ్చిన తమిళుల బృందం మాజీ అధ్యక్షులు మహింధ్రా రాజపక్సే ఎక్కడున్నాడని అడిగింది. అందుకు ఆయన తననెందుకు అడుగుతున్నారని, అ వివరాలు కావాలంటే పోలీసులన వద్దకు వెళ్లాలని బదులిచ్చారు. దీంతో శ్రీలంకలో పలు యుద్ద నేరాలకు పాల్పడి.. మానవ హక్కులను నిర్ధాక్షిణ్యంగా కాలరాసిన రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రదర్శన ఇద్దామని వచ్చిన బృందం దౌత్యవేత్త ఇచ్చిన సమాధానంతో మండిపడి ఆయనపై దాడులకు పాల్పడిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ibrahim Ansar  Sri Lanka  Malaysia  crime  assault  KLIA  

Other Articles