ఓటుకు నోటులో 8 వారాలు స్టే | High Court stay on cash for vote scam re investigation.

High court 8 weeks stay on cash for vote scam re investigation

relief to chandra babu naidu, High Court relief to CBN, AP CM relief in cash for vote scam, 8 weeks stay on Cash for vote scam, CBN quash petition on cash for vote scam

High Court stay on cash for vote scam re investigation.

ITEMVIDEOS:ఓటుకు నోటులో బాబుకు టెంపరరీ రిలీఫ్

Posted: 09/02/2016 12:12 PM IST
High court 8 weeks stay on cash for vote scam re investigation

ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడికి ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఏసీబీ ఆదేశాలపై స్టే విధించింది. ఓటుకు నోటు కేసుతో రామకృష్ణారెడ్డికి సంబంధమేమీ లేదని, రాజకీయ దురుద్దేశ్యాలతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని, దీంతో సదరు పిటిషన్ ను కొట్టేయాలని చంద్రబాబు నిన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం క్వాష్ పిటిషన్ కు ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే విధించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలను మరో కోర్టు అడ్డుకోరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలను ఆర్కే తరపు న్యాయవాది ధర్మాసనానికి గుర్తు చేశారు. సెక్షన్ 156 ఆర్డర్ పై స్టే కోరుకునే హక్కు పిటిషనర్(చంద్రబాబు) కు లేదని ఆయన వివరించారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అసలు మెమోను ఎలా ఇస్తుందని, మరో ఎఫ్ఐఆర్ అవసరం లేదని ఎలా చెబుతారంటూ ఏసీబీని  ప్రశ్నించిన న్యాయస్థానం, విచారణపై 8 వారాల స్టే విధించింది. అంతేకాదు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఎమ్మెల్యే ఆళ్ల లను వివరణాత్మక కౌంటర్ ఇవ్వాలని ఆదేశించింది.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేనని, ఈ కేసుపై పునర్విచారణ చేయాలని ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు పునర్విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ విషయంలో సుప్రీం తలుపు తడతామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cash for vote scam  High court  AP CM  chandrababu naidu  relief  

Other Articles