pawan kalyan fans slams yellow media for wrong propaganda of caste

Yellow media creating caste propaganda on pawan kalyan

Pawan Kalyan fans questions yellow media, janasena activists slams yelow media, pawan kalyan, janasena, TDP favoured media, caste propaganda on pawan kalyan, yellow media, AP special status

Actor turned politician janasena president pawan kalyan fans question TDP parliament members on their remarks against power star

జనసేనానిపై పచ్చ మీడియా కాలకూ(ల)ట విషం..!

Posted: 08/31/2016 05:27 PM IST
Yellow media creating caste propaganda on pawan kalyan

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలని, అందుకు చిన్నా, పెద్దా.. వారు వీరు అందరూ కలసి ఉద్యమించాలని అందుకు మూడు అంచెలుగా తాను కార్యక్రమాన్ని రూపోందిస్తున్నానని సినీనటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ పై కాలకూ(ల)ట విషాన్ని ప్రయోగించేందుకు పచ్చ పత్రికలు అప్పుడే సిద్దమయ్యాయి. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ తప్పులను మరోమారు ఎత్తిచూపి, ప్రత్యేక హోదా కోసం గత రెండున్నరేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన నేపథ్యంలో మళ్లీ పచ్చ మీడియాలకు ఆయన కులం గుర్తుకోచ్చింది.

పవన్ స్పీచ్ పై సంపూ ట్వీట్ ఎలా మిస్సయ్యాం...

తిరుపతి వేదికగా జరిగిన ప్రస్థాన సభలో పవన్ కల్యాన్ మాట్లాడుతూ తమ జనసేన జాతీయ దృక్పథం వున్నదని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయతా భావంతోనే తాము ముందుకు కదులుతామని, అయితే తమ రాష్ట్ర ప్రగతి అంతకన్న ముఖ్యమని చెప్పారు. వీటన్నిటికన్న రాష్ట్రానికి ప్రత్యేకహోదా అత్యవసరమని పిలుపునిచ్చారు. దాని కోసమే తాను తన పార్టీ పక్షాన ఉద్యమించనున్నానని ప్రకటించారు. అయితే తాను ఒక్కడి కాదని, జనసేన కార్యకర్తలు, తన అభిమానుల కోండంత అండతో పాటు కలసివచ్చే అందరి బలంతోనే తాను ధీనిని సాధిస్తానని కూడా అందుకోసం మూడు అంచెల కార్యచరణ ప్రణాళికను కూడా సిద్దం చేశానని వేదిక పైనుంచే చెప్పారు.

కాటమరాయుడు కూడా డౌటేనా...

పవన్ కల్యాన్ నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడతారని గత ఎన్నికలకు ముందు ఢంకా వాయించి ప్రచారం చేయించుకున్న పార్టీలు తమ చేతిలోని పచ్చ పత్రికలతో ప్రచారాన్ని కూడా చేశాయి. తీరా తాము ఎన్నికైన కాలంలో సగభాగం పూర్తైన తరువాత.. తాను అధికారంలోకి తీసుకోచ్చిన పార్టీ తప్పులను ఎత్తిచూపేసరికి.. ఆయన వెనుక పెద్ద కథే నడుస్తుందని కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. తాను హిందూ. తన కూతరు క్రిస్టియన్ అని బాహాటంగా చెప్పుకున్న నేత పవన్. అంతటి ధైర్యం ఏ నేతలకు లేదనే చెప్పాలి. అయినా.. పవన్ నిజాయితినీ శంఖించే విధంగా కథనాలు రాస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

పవన్ వ్యాఖ్యలపై మురళీ మోహన్ రియాక్షన్

 

తమది జాతీయ దృక్పథం వున్న పార్టీ అయినా రాష్ట్ర యువత భవితను పణ్ణంగా పెట్టలేనని చెప్పిన పవన్ ను రాష్ట్రవాది అని ముద్రవేయని పత్రికలు.. అయన రాజకీయాలలో నిలదొక్కుకోవాలంటే కాస్ట్ పాలిటిక్స్ మాత్రం అవసమని.. ఈ విషయం పవన్ కు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని, అందుకోసం ఆయన తన స్వరాన్ని మార్చకపోయినా.. స్టాండ్ ను మాత్రం మారుస్తున్నారని జనసేనాని కన్నా ముందుగానే పచ్చ మీడియా నిర్ణయం తీసుకుని ప్రచారాన్ని మొదలుపెట్టింది.

కుంభకర్ణుడిలా నిద్దరోయింది ఎవరు.. దమ్ముంటే..

తమ వెనుక కొండంత అండగా వున్న పార్టీల తరహాలోనూ క్యాష్ పాలిటిక్స్, కాస్ట్ పాలిటిక్స్ కు పనవ్ తెరలేపుతున్నారని కథనాలను ప్రజల్లోకి పంపుతుంది. అయితే జనాభా ప్రాతిపదికన అత్యంత తక్కువు సంఖ్యలో వున్న కమ్మ కులస్థులు ఏళ్లుగా రాష్ట్రంలోని పాలనను తమ చేతుల్లోకి తీసుకుంటే లేని తప్పు.. కాపులు తీసుకున్నంత మాత్రన తప్పు అన్నట్లుగా ప్రచారం చేయడం సమంజసమేనా..? అని కొందరు రాజకీయ విశ్లేషకులు కొత్త వాదనను తెరపైకి తీసుకోస్తున్నారు.

పవన్ మూవీ హాంఫట్ ?

కేవలం తమ కులస్థుల కోసం పోరాడుతున్న ఎందరో నాయకులకు తమ కులంలో గుర్తింపు వుంది. మంద కృష్ణ మాదిగ, ముద్రగడ పద్మనాభం, బీసీల కోసం ఉద్యమించే అర్ కృష్ణయ్య ఇలా అనేక మంది వున్నారు. ఎన్నికల సమయంలో వారందవారిని తమ వైపుకు తిప్పుకోవడంలో, వారి మద్దతు కూడగట్టుకోవడంలో సఫలం చేందిన అధికార పార్టీ కేవలం రెండేళ్లలోనే వారిని దూరం చేసుకుంది, అందుకు కారణాలు ఏంటని.. వారెందుకు అధికార పార్టీకి దూరమైయ్యారన్న కోణంలో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించని పచ్చ మీడియా.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిపట్ల మాత్రం తన రాతలకు పదనుపెడుతోంది.

పవన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు...

సెప్టెంబర్ 9న కాకినాడలో నిర్వహించే సభలో పవన్ కుల నేతలను అకట్టుకునేలా ప్రసంగిస్తారని, దీంతో కావుల డిమాండ్లపై అయన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని నిర్ణయించుకున్నారని పచ్చ మీడియాకు కలలో కనిపించి చెప్పినట్లుగా కథనాలు ప్రచురించాయి. అది కూడా ఒక వర్గానికి సంబంధించిన సమస్యగా దానిపై స్పష్టత నిస్తే మాత్రం తప్పేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కుల సంఘాలకు సబ్ ప్లాన్ లు అమలు చేసిన ప్రభుత్వాలు, పార్టీలు.. ఎన్నికలలో తప్పుడు హామీలిచ్చి.. చివరాఖరుకు వారిపైనే లాఠీలు ఝుళిపించి. నిర్భంధం చేయించి ప్రభుత్వ ప్రతిష్టను చేజార్చుకన్న పాలకుల కన్నా.. ఉన్నది ఉన్నట్లుగా చెబితే.. సమస్యను సమస్యగా ఎత్తిచూసితే తప్పేంటని నిలదీస్తున్నారు.

ఇన్ని అంశాలను తెరపైకి తీసుకువస్తున్న పచ్చ మీడియాకు అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని వుందా..? లేదా..? తమ వెనుక కొండంత అండగా వుండే పార్టీలు అందుకు సమ్మతిస్తున్నాయా..? లేక విముఖత వ్యకర్తం చేస్తున్నాయా..? అన్న వివరాలను కూడా తమ కథనంలో ప్రచురించాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తమ కు వెన్నుదన్నుగా నిలచిన పార్టీలకు ప్రచారం చేసినప్పడు రీ ఎంట్రీ అని ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయని పత్రికలు.. ఇవాళ మాత్రం పవన్ రీ ఎంటీ అంటూ కొత్త అర్థాలు వచ్చేలా విషప్రచారానికి తెరలేపుతున్నాయని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan kalyan  powerstar fans  janasena workers  yellow media  AP special status  

Other Articles