పవన్ వ్యాఖ్యలపై మురళీ మోహన్ | MP murali mohan reaction on Pawan tirupathi speech

Mp murali mohan reaction on pawan tirupathi speech

Murali Mohan Pawan Kalyan, Murali Mohan counter on Pawan, Pawan Kalyan on Murali Mohan, Murali Mohan About Pawan Kalyan, Pawan Murali Mohan, Murali Mohan on Pawan Comments, TDP fire on Pawan comments

MP Murali Mohan reaction on Pawan tirupathi speech.

పవన్ వ్యాఖ్యలపై మురళీ మోహన్ రియాక్షన్

Posted: 08/30/2016 09:52 AM IST
Mp murali mohan reaction on pawan tirupathi speech

ప్రతిపక్ష వైసీపీ ప్రత్యేకంపై కిక్కురుమనకుండా కూర్చున్న సమయంలో కేవీపీ ప్రైవేయిట్ బిల్లుతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ హీరోగా మారటమే కాదు, ప్రత్యేకంపై పోరాటానికి మిగతా పార్టీలు కదిలేలా చేసింది. ఈ క్రమంలోనే పవన్ తిరుపతి సభ పెట్టడం, ఆపై సేటస్ విషయంలో కేంద్రంపై పోరుకు పిలుపునివ్వటం తెలిసిందే. సాక్షాత్తు ప్రధాని, సీఎంలనే కాదు, కేంద్ర మంత్రులను, కీలకనేతలను, మరీ ముఖ్యంగా ఎంపీలను పార్లమెంట్ లో ఏం చేస్తున్నారంటూ ఏకేశాడు. ఇది సహాజంగానే వారికి ఆగ్రహం తెప్పించడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ తాజాగా స్పందించారు. తానేమీ రాజకీయాల్లో పదవులు పట్టుకు వేలాడే వ్యక్తిని కాదని ఆయన అంటున్నారు. మంగళవారం ఉదయం తన నియోజకవర్గం రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు తాను మాత్రమే కాదు ఎంపీలంతా కట్టుబడి ఉన్నాం, కేవలం రాజీనామాతో హోదా వస్తుందంటే అందుకు నేను సిద్ధం అని స్పష్టం చేశారు.

ఎంపీ పదవి తనకు ముఖ్యం కాదని, అందరినీ కలుపుకుని స్పెషల్ స్టాటస్ కోసం పోరాడతామని వివరించారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల గొంతుక వినిపించాల్సిన తమపై ఉందన్న విషయం ఎవరో చెబితేగానీ గుర్తించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ అధినేత చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలు చేయొద్దని, త్వరలో అన్నీ పార్టీల ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి విషయాలను వివరిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali Mohan  Pawan Kalyan  Tirupathi  speech  

Other Articles