Petrol price hiked by Rs 3.38 per litre, diesel by Rs 2.67/litre

Petrol prices hiked by rs 3 38 litre diesel by rs 2 67

BJP, Diesel, petrol, petrol prices hike, dissel price hike, Fule price hike, India, Indian Oil Corp, Narendra Modi, Petro vehicle owners, excise duty, social media fumes on fuel price hike

Petrol price was on Wednesday hiked by a steep Rs. 3.38 per litre and diesel by Rs. 2.67 a litre, reversing a two-month declining trend.

భారీగా పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారుల జేజులకు చిల్లులు

Posted: 08/31/2016 08:45 PM IST
Petrol prices hiked by rs 3 38 litre diesel by rs 2 67

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ వాహనదారుల నడ్డీ విరిచింది. ఇటు పెట్రోల్ వాహనాలతో పాటు అటు డీజిల్ వాహనదారుల మనీపర్సులకు కూడా చిల్లులు పెట్టింది. ఇంధన ధరలను ఏకంగా పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయాలకు మొగ్గుచూపించింది, ఫలితంగా ఇంధన ధరలు స్థానిక పన్నలు కలుపుకుని హైదరాబాద్ నగరంలో సుమారుగా నాలుగు రూపాయల పైచిలుకు, డీజిల్ మూడు రూపాయల పైచిలుకు మేరకు చేరుకున్నాయి. ఇక యధావిధిగా పెంచిన ఇంధన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

గత రెండు మాసాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలకు ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయాయి, డీజీల్ ధరలు ఒక్కోసారి పెరుగుతూ, ఒక్కోసారి తగ్గుతూ వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  చమురు సంస్థల నిర్ణయానికి మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వంపై కూడా నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నరేంద్రమోడీ సర్కార్ ఇంధనం విషయంలో అంతకుముందున్న యూపీఏ విధానాన్నే ఎందుకు పాలో అవుతున్నారని కూడా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇంధర ధరలు అంతర్జాతీయంగా తక్కువ స్థాయిలో వున్నప్పుడు.. ధరలను తగ్గించి వెనువెంటనే ఎక్సైజ్ డ్యూటీ గా కేంద్రం సేకరిస్తున్న డబ్బును ఇప్పుడు వినియోగించకుండా కేంద్రం ఏం చేస్తుందని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇందన ధరలు 13 శాతం మేర పెరిగాయని చెబుతున్న చమురు సంస్థలు ఆ ప్రభావంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఇంధన ధరల విషయంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో విఫలమవుతున్నాయని కూడా పలువురు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Diesel  Fule price hike  India  Indian Oil Corp  Narendra Modi  Petrol  

Other Articles