Ycp spoke's person alleges nara lokesh car driver rode revanth car on that day

Another eidence in vote for note case is here

vote for note, horse riding case, chandrababu naidu, kcr, telangana government, telangana acb, high court, nara lokesh, revanth reddy, botsa satyanarayana

Ysr congress party spoke's person botsa satyanaranaya alleges ap cm chandrababu son nara lokesh's car driver rode revanth car on cash offering day to trs mla stephen son.

ఓటుకు నోటు కేసులో మరో అధారమిదిగో..

Posted: 08/31/2016 02:29 PM IST
Another eidence in vote for note case is here

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నేతలకు ఇది మరో చేధు వార్తే. ఎందుకంటారా.. ఈ కేసులో మరో అధారం కూడా లభించింది. స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే.. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు యాభై  లక్షల రూపాయలు పంపారనడానికి ఇది కూడా మరో అధారంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు ఏపీ విఫక్ష నేతలు. అదేంటంటే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కారు డ్రైవర్ వున్నా.. ఆయనను కాదని, రేవంత్ వెంట నారా లోకేష్ ను డ్రైవర్ గా పంపించారని వైసీపీ అధికార ప్రతినిధి బోత్స సత్యనారాయణ అరోపించారు.

పిల్లనిచ్చిన మామ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ను వెన్నుపోటు పోడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజకీయాలలో తన నీడను కూడా నమ్మడని అందుకు ఇదే ఉదాహరణ అని పేర్కోన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా పూర్తి విశ్వసం లేకనే.. లోకేష్ కారు డ్రైవర్ ను ఆయన కారు డ్రైవర్ గా పంపించారని అన్నాడు. రాజధాని లేని రాష్ట్రమని మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రి.. రాజధాని కోసమంటూ రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మీకులు ఇచ్చిన విరాలాలను తన సొంత పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని బొత్స దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా కేసుల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టరాదని హితవు పలికారు.

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత‌లు త‌ప్పులు చేయ‌డ‌మే కాకుండా చ‌ట్టాన్ని చేతిలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కేసు నుంచి త‌ప్పించుకోవ‌డానికి టీడీపీ నేత‌లు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ప‌లు అస‌త్యాలు ప‌లుకుతున్నార‌ని, ఎవ‌రు చెవిలో పూలు పెడ‌తార‌ని ఆయ‌న దుయ్య‌బట్టారు. ఈ కేసును నీరుగార్చేందుకు కూడా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయని బొత్స ఆరోపించారు. తాన రాజకీయ జీవితం తెరచిన పుస్తకమని, నీతికి నిజాయితీకి తానోక నిలువుటద్దమని తనకు తాను బాడాయిలకు పోయే చంద్రబాబు.. నిజంగా తాను అన్న మాటాలకు కట్టుబడి వుంటే కేసు విచారణకు ఎలాంటి అవరోదాలు, కేంద్రం నుంచి ఒత్తిళ్లు తీసుకురావద్దని బోత్స డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles