ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన | central likely to announce key announcement on AP special status

Central likely to announce key announcement on ap special status

AP special Status, Central on AP special status, Modi AP special status, Central announcement on AP special status, Andhra Pradesh Special Status, Modi AP special status, ministres on AP special status, special railway zone for Andhra Pradesh, new railway zone for AP

central likely to announce key statement on AP special status before PM Modi Foreign tour.

హోదాపై రెండు, మూడు రోజుల్లో అనౌన్స్ మెంట్?

Posted: 08/31/2016 11:10 AM IST
Central likely to announce key announcement on ap special status

ప్రత్యేక హోదా కోసం ఏపీ నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నా కాస్తయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ తర్వాత ‘ప్రత్యేక’ వేడి రాజుకోవడం, ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మరింత సాగదీయడం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేక హోదాపై ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా వచ్చేనెల 3న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 2నే ఇందుకు సంబంధించి స్వయంగా మోదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో 'హోదా' అన్న పదం ఉందా? అన్న విషయం తెలియలేదుగానీ, హోదా వస్తే లభించే అన్ని ప్రయోజనాలకూ చోటు కల్పించినట్టు తెలుస్తోంది. మిగిలిన ప్రయోజనాలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపైన కూడా స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు టెంపరరీ హోదాను జైట్లీ ప్రకటిస్తారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. 

కాగా సోమ, మంగళవారాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హోదా, ప్యాకేజీపై రెండు విడతలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పినట్టు సమాచారం. అయితే విభజన సమయంలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చాలని కేంద్రం నిర్ణయించిన వేళ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని వరాలను ప్రకటిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఏపీ పరిస్థితిని వివరిస్తూ, వారికి సర్దిచెప్పే మార్గాలను అన్వేషించాలని జైట్లీ, వెంకయ్యనాయుడులకు షా సూచించినట్టు తెలిసింది. కాగా, కేంద్ర మంత్రి సుజనా తయారు చేసిన ముసాయిదాపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత తుదిరూపు ఇచ్చి బహిర్గత పరచాలని కేంద్రం భావిస్తోంది.

ప్రత్యేక రైల్వే జోన్ కూడా?
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా కేంద్రం తయారు చేసిన ముసాయిదా విభజన హామీలను అన్నింటినీ ప్రస్తావిస్తూ అత్యంత సమగ్రంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో పెండింగులో ఉన్న వాటన్నింటినీ ఇందులో చేర్చినట్టు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్ గా మారడం, రాజీపడబోమని చంద్రబాబు చెప్పడం, హోదా ఇవ్వకపోవడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న నిరసనలతో మెట్టు దిగిన కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించి వరుస భేటీలు జరిపి ఈ ప్రతిపాదనలను తయారు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్, హామీల అమలు దిశగా చేయాల్సిన కార్యక్రమాలు, మరిన్ని విద్యాసంస్థలు, పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. హోదా ఇస్తే కలిగే రాయితీల ప్రయోజనాలను విడిగా ఇస్తామని వివరణాత్మకంగా చెబుతూ, ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు, పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు గురించిన సమాచారం కూడా ఈ ముసాయిదాలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Special Status  Central  Modi  announcement  

Other Articles