Minor student allegedly beaten to death for not clearing school fees in Manipur

Minor student beaten to death for not paying fees

manipur, manipur death, manipur student death, manipur minor student, minor student, student death, national news

"The school authorities told me to clear the fees or take my son away, but when I went to take him back they said unless the fees are cleared he could not be taken out," Bira Tongbram, Suresh's father, said.

మణిపూర్ లో దారుణం.. పీజు చెల్లించలేదని విద్యార్థిని..

Posted: 08/29/2016 07:40 AM IST
Minor student beaten to death for not paying fees

తమ పిల్లాలు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుతాడన్న కన్నతల్లిదండ్రులు ఆశలపై పాఠశాల యాజమాన్యం చిదిమేసింది. ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్ధిపై కక్షగట్టిన పాఠశాల యాజమాన్యం.. సదరు విద్యార్థిని దారుణంగా కోట్టి చంపారు, స్కూలు అధికారుల దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ప్రాణాలు విడిచారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో ఈ దారుణఘటన జరిగింది. సురేష్ తొంగ్‌బ్రమ్ అనే విద్యార్థిని కొట్టినందుకు స్కూలు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిది అసహజ మరణం అని తేలితే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.

తమది పేద రైతు కుటుంబం కావడంతో ఇంఫాల్ సమీపంలోని లాంగోల్‌లో గల రెసిడెన్షియల్ కిడ్స్ కేర్ స్కూలు ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించలేకపోయానని సురేష్ తండ్రి బీరా తొంగ్‌బ్రమ్ చప్పారు. తమ అబ్బాయి రెండేళ్ల క్రితం ఆ స్కూల్లో చేరాడన్నారు. ఫీజులు చెల్లించాలి లేదా పిల్లాడిని తీసుకెళ్లిపోవాలని వాళ్లు చెప్పారని, దాంతో ఏమీ చేయలేక తాను పిల్లాడిని తీసుకెళ్లిపోదామని స్కూలుకు వెళ్తే.. ఫీజులు చెల్లించనిదే తీసుకెళ్లడానికి వీల్లేదన్నారని ఆయన తెలిపారు.

సరే ఎలాగైనా ఫీజు డబ్బులు సమకూర్చుకుని కట్టేద్దామనుకుంటున్న నేపథ్యంలో పాఠశాల అధికారులే తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చారని, అతడి శరీరం అంతా వాతలు తేలి ఉన్నాయని.. ఏంటని అడిగితే క్రమశిక్షణ తప్పడం వల్ల శిక్షించినట్లు చెప్పారని అన్నారు. అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోతూ ఈనెల 31 లోగా మొత్తం ఫీజు చెల్లించాలని తనకు చెప్పారన్నారు. ఇంటికి రాగానే కుప్పకూలిపోయిన సురేష్.. ఆ మర్నాడే మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. తనకు న్యాయం జరిగేవరకు కొడుకు శవాన్ని తాను తీసుకెళ్లేది లేదని బీరా తొంగ్‌బ్రొమ్ చెప్పారు. స్కూలు వాళ్లు ఇష్టం వచ్చినట్లు కొట్టడం వల్లే సురేష్ చనిపోయాడని ఆయన అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles