పానీ పూరి అమ్మకుంటున్న ఒలంపిక్ విజేత | after Rio olympics we should think about Sita Sahu

After rio olympics we should think about sita sahu

Sita Sahu, Athens Special Olympics winner Sita Sahu, Sita Sahu sold golgappas, what about Sita Sahu, Olympian sita sahu, Sita Sahu sad story

After Rio olympics we should think about Sita Sahu, sold golgappas on road.

పానీ పూరీ అమ్ముకుంటున్న ప్రపంచ విజేత

Posted: 08/27/2016 02:05 PM IST
After rio olympics we should think about sita sahu

భారత్ విశ్వ క్రీడాల్లో రెండు పతకాలు సాధించింది. దేశ మంతా ఇప్పుడు సింధు, సాక్షి మాలిక్ పేర్లు మారుమోగ్రిపోతున్నాయి. ఒలంపిక్స్ లో పైగా ప్రపంచ నలమూలల దేశాల నుంచి వచ్చే క్రీడాకారులతో పోటీపడి, గెలిచి పతకాలు తేవటం అంటే మాటలు కాదు కదా. అందుకే వారిపై ఇప్పుడు కనక వర్షం కురుస్తోంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాల వరాలను ప్రకటిస్తున్నయి. వారి కష్టానికి తగ్గ ఫలితం అందిందని అందరమూ అనుకుంటాం. ఇదే సమయంలో హృదయ విదారక గాధ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా.

ఒలింపియన్లలో కూడా తమ ప్రతిభకు గుర్తింపు రాక, పూట గడవక జీవన గమనం కోసం నానా ఇబ్బందులూ పడుతున్న వారున్నారు. వారిలో ఒకరే సీతా సాహు. 15 ఏళ్లకే 2011 ఏథెన్స్ లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ లో 200, 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో సత్తా చాటిన సాహూ రెండు కాంస్య పతకాలను మన దేశానికి అందించింది.

sita sahu

మధ్యప్రదేశ్ లో ఓ కడుపేద కుటుంబంలో పుట్టిన ఆమెకు చేదోడుగా నిలిచి మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదు. ఇల్లే గడవని వేళ, శిక్షణ ఎందుకని భావించిన ఆమె, ఇప్పుడు తన ఇంటి ముందే పానీపూరీలు అమ్ముకుంటోంది. నిజానికి ఆమె వ్యథపై నాలుగేళ్లుగా జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. అయినా ఆమెను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రతిభ గల క్రీడాకారులకు సరైన ప్రోత్సహాం ఇవ్వకపోవటం వల్లనే సీత లాంటి ఎందరో ప్రతిభావంతులు తెర వెనకాలే కనుమరుగైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sita Sahu  Golgappas  road  Olympian  

Other Articles