ఖమ్మంలో వరుస కిడ్నీ మరణాలు | serial kidney disease deaths in Khammam

Serial kidney disease deaths in khammam

kidney disease deaths in Khammam, Aswaraopeta Kideney deaths, Kidney deaths in Telangana, Mallaigudem deaths

serial kidney disease deaths in Khammam.

ఖమ్మంలో కిడ్నీ డెత్స్ కలకలం

Posted: 08/24/2016 11:49 AM IST
Serial kidney disease deaths in khammam

ఖమ్మంలో వరుసగా కిడ్నీ మరణాలు పెరగటం ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అశ్వారావుపేట మండ‌లం మ‌ల్లాయి గూడెంలో ఏకంగా 30 మంది గ్రామ‌స్తులు కిడ్నీ స‌మస్యలతో బాధపడుతూ చికిత్సపొందుతుండగా, కేవలం వారం రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

కిడ్నీ చెడిపోయి వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతుందని, ప్రాథమిక వైద్యాధికారులు చెబుతున్నారు. గత పదిరోజుల్లో ఐదుగురు చనిపోయారు, బుధవారం సీత‌మ్మ(52) అనే మరో గిరిజ‌న మ‌హిళ‌ మృతి చెందింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందించాం అని వైద్యులు చెబుతున్నారు.

కలుషితమైన తాగునీటితోనే వారంతా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, సరైన వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలు సమస్యేంటో తెలుసుకోడానికి మూత్ర, రక్త పరీక్షలు చేసేందుక కనీస సౌకర్యాలు లేని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఓవైపు ప్రాణాలు పోతున్నాయని గూడెంవాసుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొగా, మరింత సమాచారం అందాల్సి ఉందని అధికారులు తాపీగా చెబుతుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Kidney deaths  khammam  

Other Articles