Did Prakash Javadekar just say Bose, Nehru were hanged

Hrd minister says nehru patel were hanged

Union Human Resource Development (HRD), Prakash Javadekar, Jawaharlal Nehru, Sardar Vallabhai Patel, Nehru, Tiranaga Yatra, Sardar Patel, Nehru, History, Madhya pradesh, Subhash Chandra Bose, Raj Guru, Bhagat Singh

Union Human Resource Development (HRD) Minister Prakash Javadekar has come under fire for saying that Jawaharlal Nehru and Sardar Patel were hanged by British.

ITEMVIDEOS: చరిత్రకు చెదలు పట్టిస్తున్న కేంద్ర మంత్రి.. విమర్శల వెల్లువ

Posted: 08/23/2016 02:41 PM IST
Hrd minister says nehru patel were hanged

దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రి ఎవరని విద్యార్థులను అడిగినా.. టక్కున చెబుతారు. ఇక స్వాతంత్ర్యం తరువాత అక్కడక్కడా ప్రత్యేక రాజ్యాలుగా వున్న ప్రాంతాలను దేశంలో విలీనం చేసిందెవరని అడిగితే కొంచెం కష్టమైనా.. విద్యార్థులు చెబుతారు. సాక్షాత్తు ఇక ఈ రెండో ప్రశ్నను బీజేపి నేతలు మరీ ముఖ్యంగా కేంద్రమంత్రులు ఆయన పేరును అధికంగా వల్లెవేస్తుంటారు. కానీ దేశ విద్యాశాఖకు దిశానిర్ధేశం చేసే కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ఈ విషయంలో మరీ పూర్ అని తెలిసింది. అయనకు చరిత్ర విషయంలో వున్న పరిజ్ఞానం సభాహుతులు అశ్చర్యపోయారు.

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో తిరంగా యాత్రను ప్రారంభించిన ఆయన నిండు సభలో ఆయన చరిత్రను వక్రీకరించారు. అంతేకాదు దేశ స్వత్రంత్య సమరయోధులకు అవమానం జరిగేలా వ్యవహరించారు. ఇంతకీ ఆయన చెప్పిన విషయమేంటంటే.. దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతో పాటు దేశంలోని ముక్కలుగా వున్న పలు రాజ్యాలను విలీనం చేసి అఖండభారతావనిగా చేసిన ఉక్కు మనిషి సర్థార్ వల్లభభాయ్ పటేల్ లు కూడా స్వతంత్ర్య సమర సమరంలో అమరులయ్యారట. అలా చెప్పి ఆయన తన నాలుక కర్చుకున్నారు.

భగత్ సింగ్, రాజ్ గురుతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ పాలకులు ఉరితీశారని ఆయన తప్పులు ఒప్పజెప్పారు. '1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య సమరం 90 ఏళ్ల అనంతరం బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టడంతో ముగిసింది. బ్రిటిష్ పాలకులు ఉరితీసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ (నెహ్రూ), భగత్ సింగ్, రాజ్ గురు వంటి స్వాతంత్ర్య పోరాటయోధులకు మనం ఈనాడు జోహార్లు అర్పిస్తున్నాం' అని పేర్కొన్నారు.

దేశంలోని విద్యాశాఖ వ్యవహారాలను చూసే జవదేకర్ తన ప్రసంగంలో చారిత్రక వాస్తవాలను తప్పుగా ఉటంకించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవానికి తొలి ప్రధాని నెహ్రూ సహజ కారణాలతో 1964లో 74 ఏళ్ల వయస్సులో మరణించారు. భారత ప్రథమ కేంద్ర హోమంత్రి పటేల్ 1950లో 75 ఏళ్ల వయస్సులో ప్రాణాలు విడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీగా మిగిలిపోయాయి. అయితే జవదేకర్ చెప్పిన విషయంలో భగత్ సింగ్, రాజ్ గురులను మాత్రమే బిటిష్ సర్కారు ఉరితీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Javadekar  Nehru  Tiranaga Yatra  Sardar Patel  Nehru  History  Madhya pradesh  

Other Articles