కోమట్టిరెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డిని నయీం చంపాడా? | komatireddy son PrateekReddy murdered by Naeem

Komatireddy son prateekreddy murdered by naeem

komatireddy son death, komatireddy son Murder, komatireddy son prateek death mystery, prateek reddy Nayeem, Nayeem kills Komati Reddy Son

komatireddy son PrateekReddy murdered by Naeem.

కోమటిరెడ్డి కొడుకును నయీమే చంపాడా?

Posted: 08/23/2016 08:59 AM IST
Komatireddy son prateekreddy murdered by naeem

నల్గొండ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి చనిపోయింది యాక్సిడెంట్ లో కాదా? హత్యా? దాని వెనుక ఎవరు ఉన్నారు? గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత వెలుగు చూస్తున్న కోణాలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లను పంచుతున్నాయి. 5 ఏళ్ల క్రితం మెదక్ రామచంద్రాపురం, కొల్లూరు వద్ద జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితోపాటు అతని మరో ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే చనిపోగా, ఒకతను మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపక్కనున్న మట్టి కుప్పను తాకి కారు పల్టీలు కొట్టి ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారణ కూడా చేశారు.

అయితే అది హత్యేనని, చేయించింది నయీమేనని అంటున్నాడు వ్యాపారి గంపా నాగేందర్. నయీం పోయాక బయటికి వస్తున్న అతని బాధితులు ఒక్కోక్కరుగా పోలీసుల ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగేందర్ ఈ సంచలన ప్రకటన చేశాడు.

‘గత మార్చి 18న కొందరు నన్ను నయీం వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీం నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించాడు. ఈ మేరకు ఐదు రోజుల క్రితం భువనగిరి పోలీస్ స్టేషన్ లో నాగేందర్ ఫిర్యాదు కూడా చేశాడు.

అయితే ఇది కేవలం బెదిరింపు కూడా కావొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశాకే ఓ నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు. కాగా, తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీం తనను బెదిరించాడని వెంకట్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KomatiReddy  son  Prateek  accident  Nayeem  death  

Other Articles