ఖేల్ రత్న, అర్జున అవార్డు 2016 ప్రకటించిన కేంద్రం | Khel Ratna and Ajuna Awards 2016 announced

Pv sindhu sakshi malik dipa karmakar jitu rai to get khel ratna

PV Sindhu Khel Ratna, Khel Ratna Sakshi Malik, Khel Ratna Dipa Karmakar, Jitu Rai Khel Ratna, Rajeev Khel Ratna 2016 awards, Arjuna Awards 2016, awards for Rio Olympics winners, Khel Ratna 2016

PV Sindhu, Sakshi Malik, Dipa Karmakar, Jitu Rai to get Khel Ratna. Central also announced Arjuna Awards to 15 members.

సింధు ఇక ఖేల్ రత్న... సాక్షితోపాటు మరో ఇద్దరికి కూడా

Posted: 08/22/2016 06:14 PM IST
Pv sindhu sakshi malik dipa karmakar jitu rai to get khel ratna

రియో ఒలంపిక్స్ లో రెండు పతాకాలతో సరిపెట్టుకున్న భారత్ ఇద్దరమ్మాయిల పుణ్యమాని పరువు నిలుపుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఖేల్ రత్న పురస్కారాలు ప్రకటించడం విశేషం. తొలిసారిగా నలుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

రజతంతో మెరిసిన పీవీ సింధుకి, కాంస్యంతో అలరించిన సాక్షి మాలిక్ కు, అలాగే జిమ్నాస్టిక్స్ లో సత్తా చాటిన దీపా క‌ర్మాక‌ర్‌, షూటర్ జీతూ రాయ్ లకు ఖేల్ రత్న పురస్కారాలు వరించనున్నాయి. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్నట్లు తెలిపింది. దీపా క‌ర్మాక‌ర్ కోచ్ విశ్వేశ్వ‌ర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్రకటించింది. నాగ‌పురి ర‌మేశ్‌(అథ్లెటిక్స్‌), సాగ‌ర్ మాల్ ధ్యాయ‌ల్ (బాక్సింగ్‌), రాజ్‌కుమార్ శ‌ర్మ‌ (క్రికెట్‌), ప్ర‌దీప్ కుమార్ (స్విమ్మింగ్‌), మ‌హావీర్ సింగ్ (రెజ్లింగ్‌)ల‌కు ద్రోణాచార్య పుర‌స్కారం ప్రక‌టించింది.

15 మందకి అర్జున అవార్డులు:
కేంద్ర ప్రభుత్వం ఈరోజు 15 మందికి అర్జున అవార్డులు(2016) ప్రక‌టించింది. రజత్ చౌహాన్ (ఆర్చరీ), ల‌లితా బాబ‌ర్ (అథ్లెటిక్స్‌), సౌర‌వ్ కొఠారి (బిలియ‌ర్డ్స్‌), శివ‌థాపా(బాక్సింగ్‌), అజింక్యా ర‌హానే(క్రికెట్‌), సుబ్రతా పాల్‌(ఫుట్‌బాల్‌), రాణి(హాకీ), వీఆర్ ర‌ఘునాథ్‌(హాకీ), గురుప్రీత్‌సింగ్(షూటింగ్‌), అపూర్వి చందేలా(షూటింగ్‌), సౌమ్య‌జిత్ ఘోష్‌(టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్‌), అమిత్‌కుమార్‌(రెజ్లింగ్‌), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్‌), వీరేంద్ర సింగ్‌(రెజ్లింగ్‌-బ‌ధిర‌)కు అర్జున అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.

ఇక ముగ్గురికి ధ్యాన్‌చంద్ అవార్డు(2015)ల‌ను అందించ‌నున్నట్లు కేంద్రం పేర్కొంది. స‌త్తి గీత‌(అథ్లెటిక్స్‌), సివ్లాన‌స్ ధంగ్ ధంగ్‌(హీకీ), రాజేంద్ర ప్ర‌హ్లాద్ షెల్కె (రోయింగ్‌)లకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khel Ratna Puraskar  201  Arjuna Awards  Rio Olympics  

Other Articles