ఎస్సీ, ఎస్టీ పెళ్లిళ్ల కోసం యూపీ నేతల క్యూ | UP reserved seats aspiring netas seek SC ST wives

Up reserved seats aspiring netas seek sc st wives

UP reserved seats, SC ST marriages, UP assembly elections Leaders marriages, reserved seats aspirants SC ST marriages

UP reserved seats aspiring netas seek SC ST wives.

ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు కావలెను

Posted: 08/22/2016 11:02 AM IST
Up reserved seats aspiring netas seek sc st wives

అది ఉత్తరప్రదేశ్ లో ని ఇగ్లాస్ పట్టణం. అగ్రకులానికి చెందిన యువనేత రవీందర్ సింగ్ వధువు కావలెను అనే ప్రకటన ఇచ్చాడు. దాంట్లో విశేషం ఏముంది అంటారా? షెడ్యుల్ తరగతి (ఎస్సీ) అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇదంతా చూసి అతనో ఆదర్శవాద భావాలున్న వ్యక్తి అనుకుంటే సుద్ధ పొరపాటే. ఇదంతా వచ్చే ఏడాది అక్కడ జరగబోయే ఎన్నికల మహిమ.

అవును... అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ అసెంబ్లీ నియోజకవర్గం. ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని రవీందర్ రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇంతలో దానిని ఎస్సీకి కేటాయించినట్లు తెలుసుకుని కాస్త భంగపడ్డాడు. అయినా నిరాశచెందకుండా తెలివి ప్రదర్శిస్తున్నాడు. షెడ్యూల్డ్ కులాల నుంచి ఓ మంచి అమ్మాయిని ఎంచుకుని వివాహం చేసుకుని ఆమెను పోటీలో నిలిపి, తన రాజకీయ వాంఛను నెరవేర్చుకోవాలన్న ప్రణాళికల్లో ఉన్నాడు. ఇందుకోసం రూపాయి కట్నం తీసుకోబోనని అతను చెబుతుండగా, ఇప్పటికే ఓ 10 సంబంధాల వరకూ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇది ఒక్క రవీందర్ సింగ్ విషయంలోనే కాదు. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించి, ఆపై నియోజకవర్గాల రిజర్వేషన్లతో అవకాశాలను కోల్పోయిన ఎందరో నేతలు చేస్తున్న ఫ్లాన్ ఇది. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు.

మరో ఉదంతం గమనిస్తే... మూడు నెలల క్రితం బీజేపీ నేత మేఘరాజ్, ఓ దళిత యువతిని పెళ్లాడాడు. "నా రాజకీయ కలను నా భార్యను పోటీలోకి దింపడం ద్వారా నెరవేర్చుకుంటా" అని ఆయన చెబుతుండటం గమనార్హం. అంతకుముందే ఆయన తన తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదని మేఘరాజ్ అంటున్నారు.

గతంలో ఇగ్లాస్ నుంచి పోటీపడ్డ రాష్ట్రీయ లోక్ దళ్ నేత హరిచరణ్ సింగ్, ఇప్పుడు తన భార్యను బరిలోకి దింపాలని భావిస్తున్నాడు. ఈయన 12 ఏళ్ల క్రితమే సులేఖా అనే ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు లెండి. గతంలో జనరల్ కోటాలో ఉండి, ఇప్పుడు రిజర్వ్ అయిన పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. యూపీలో మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో గెలిచిన వారు నామమాత్రమేనని, వారి భర్తలే రాజ్యమేలుతుంటారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SC ST marriages  UP  elections  reserved seats  

Other Articles